Share News

Anand Mahindra: వందేళ్లకు పైగా చెరగని చరిత్ర.. పులకించిపోయిన ఆనంద్ మహీంద్రా..

ABN , Publish Date - Dec 21 , 2024 | 04:03 PM

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన మనసుకు నచ్చిన వాటిపై తన అభిప్రాయాలను తెలియజేస్తారు. తాజాగా ఆయన మైసూర్ శాండిల్ సోప్ గురించిన ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోను చూసి తన మనసు పులకించిపోయిందని పేర్కొన్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Anand Mahindra: వందేళ్లకు పైగా చెరగని చరిత్ర.. పులకించిపోయిన ఆనంద్ మహీంద్రా..
Anand Mahindra

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు కూడా తగినంత సమయం కేటాయిస్తారు. తనకు ఆసక్తికరంగా అనిపించిన, ఫన్నీగా అనిపించిన వీడియోలను షేర్ చేస్తుంటారు. ఒక్కోసారి తన మనసుకు నచ్చిన వాటిపై తన అభిప్రాయాలను తెలియజేస్తారు. తాజాగా ఆయన మైసూర్ శాండిల్ సోప్ (Mysore sandal soap) గురించిన ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోను చూసి తన మనసు పులకించిపోయిందని పేర్కొన్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ అయిన మైసూర్ శాండల్ సోప్‌ను 1916లో అప్పటి మైసూర్ రాజు కృష్ణ రాజు వడియార్ స్థాపించారు. కృష్ణరాజు దగ్గర దివాన్‌గా ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ సంస్థను నెలకొల్పారు. పూర్తిగా ప్రకృతి వనరులతో, సహజసిద్ధమైన గంధం నూనెలతో ఈ సబ్బులను తయారు చేస్తారు. మైసూర్ శాండల్ సోప్‌లకు మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గిరాకీ ఉంది. ఆ కర్మాగారంలో రోజుకు 10 నుంచి 12 లక్షల సబ్బులను తయారు చేస్తుంటారు. వాటిని దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. మొదట్లో ఈ సంస్థ సబ్బులను మాత్రమే తయారు చేసేది. ప్రస్తుతం సబ్బులతో పాటు పౌడర్, షాంపూ, డిటర్జెంట్ సహా 40 రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.


ఆ కర్మాగారంలో సబ్బులను తయారు చేస్తున్న వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఆ వీడియో వైరల్‌గా మారి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా దృష్టికి వెళ్లింది. ఆ వీడియోను ఎక్స్ (ట్విటర్) ద్వారా పంచుకున్న ఆనంద్ మహీంద్రా.. ``ఈ వీడియో చూసిన తర్వాత గత స్మృతులతో పులకించపోయాను. రోజురోజుకూ ఆ సంస్థ ఎంతో అభివృద్ధి చెందడం సంతోషంగా ఉంది. ఆ సాంప్రదాయ పరిమళాలను ఆస్వాదించేందుకు ఆ ఉత్పత్తులను కొంటాన``ని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి..

Viral Video: వార్నీ.. రీల్స్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..


Optical Illusion Test: మీ కళ్లకు సిసలైన పరీక్ష.. ఈ వ్యక్తుల మధ్యనున్న 3 అరటి పళ్లను కనుక్కోండి..


Viral Video: పాపం.. బైక్ ఎక్కిన స్నేహితుడికి షాక్.. రోడ్డు మీద ఏం జరిగిందో చూస్తే నవ్వాపుకోలేరు..


Viral News: ఉబర్‌లో క్యాబ్ బుక్ చేస్తే.. వచ్చినదాన్ని చూసి ఆశ్చర్యపోయిన ప్రయాణికుడు.. వీడియో వైరల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 21 , 2024 | 04:03 PM