Share News

Iphone 16 ban: ఇండోనేషియాలో ఐఫోన్ 16పై నిషేధం! పర్యాటకుల్లో టెన్షన్!

ABN , Publish Date - Oct 25 , 2024 | 06:48 PM

ఇండోనేషియా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఐఫోన్ 16 అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధిస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Iphone 16 ban: ఇండోనేషియాలో ఐఫోన్ 16పై నిషేధం! పర్యాటకుల్లో టెన్షన్!

ఇంటర్నెట్ డెస్క్: ఇండోనేషియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఐఫోన్ 16 అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇండోనేషియా పౌరులు విదేశాల్లో కూడా వాటిని కొనుగోలు చేయొద్దని తేల్చి చెప్పింది. అయితే, ఈ నిర్ణయంతో విదేశీ పర్యాటకుల్లో టెన్షన్ మొదలైంది. ఐఫోన్ 16 ఫోన్‌ను ఇండోనేషియాకు తీసుకెళ్లకూడదా? ఇప్పటికే అక్కడికి బయలుదేరిన వారి పరిస్థితి ఏమిటీ? అంటూ జనాలు నెట్టింట తమ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన


ఇండోనేషియా మంత్రి కర్తసస్మితా ప్రకారం, దేశంలో ఐఫోన్ 16 వినియోగం కోసం కావాల్సిన ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (ఐఎమ్ఈఐ) నెంబర్ ధ్రువీకరణ లేదట. అందుకే ఈ మొబైల్స్‌పై నిషేధం విధించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఫోన్లు మార్కెట్లో దర్శనమిస్తే వెంటనే ప్రభుత్వానికి సమాచారమివ్వాలని కూడా ప్రజలకు సూచించారు.

Travel Trends: లాంగ్‌ వీకెండ్‌కు పోదాం చలోచలో..!


నిషేధం వెనక కారణాలు..

ఇండోనేషియాలో పెట్టుబడులు పెడతానన్న ఐఫోన్ ఈ విషయంలో విఫలం కావడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు స్థానిక మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. మొత్తం 1.71 ట్రిలియన్ రుపయ్యాలు పెట్టుబడి పెడతానన్న యాపిల్ 1.48 ట్రిలియన్లకే పరిమితమైనట్టు తెలుస్తోంది.

కాగా, నిషేధానికి సంబంధించి గత నెలలోనే ఇండోనేషియా మంత్రి కీలక ప్రకటన చేశారు. టీకేడీఎన్ సర్టిఫికేషన్‌కు సంబంధించి అనుమతుల జారీ పెండింగ్‌లో ఉన్నందుకు నిషేధం తప్పదని పేర్కొన్నారు. టీకేడీఎన్ నిబంధనల ప్రకారం, ఐఫోన్‌ల తయారీకి వినియోగించే వనరుల్లో 40 శాతం స్థానికంగానే సేకరించాలి.

ఇండోనేషియాలో నిషేధం అమలవుతున్న నేపథ్యంలో పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇండోనేషియా టూర్‌లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పర్యాటకులు తమ వెంట మరో ఫోన్‌ను తీసుకెళ్లాలి. ఐఫోన్ పాత మోడళ్లను నిరభ్యంతరంగా తీసుకెళ్లొచ్చు. స్థానికంగా అందుబాటులో ఉండే ఫోన్లను కూడా వినియోగించవచ్చు.

Read Latest and Travel News

Updated Date - Oct 25 , 2024 | 06:55 PM