Shocking: 2038 జులై 12న మానవాళి అంతం.. భూమిని ఢీకొట్టనున్న గ్రహశకలం!!
ABN , Publish Date - Jun 23 , 2024 | 08:19 PM
గ్రహశకలం భూమిని ఢీకొట్టే ముప్పు ఇప్పటికిప్పుడు ఎదురైతే ఏం చేయాలి, ఈ ముప్పును నివారించేందుకు మానవాళి ప్రస్తుత సామర్థ్యం ఎంత? ఇంకా ఏం చేయాలి అనే అంశాలను సమీక్షించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ ఇటీవల ఓ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో వివిధ ప్రభుత్వ విభాగాలు పాల్గొని తగు సూచనలు సలహాలు చెప్పాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఏంటి.. షాకయ్యారా? యుగాంతం వచ్చేసిందని భయపడ్డారా? అలాంటిదేం లేదు. కానీ ఇదే ప్రమాదం ముంచుకొస్తే ఏం చేయాలనే అంశంపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఇటీవల కసరత్తు చేసింది. విపత్తు నిర్వహణకు ఏం చేయాలనే దానిపై చర్చించేందుకు, ప్రమాదాన్ని అడ్డుకునేందుకు మానవాళికున్న శక్తియుక్తులు, లోపాలు ఏంటో అంచనా వేసేందుకు ఈ తరహా పరీక్ష పెట్టింది. ఇందులో వివిధ అమెరికా ప్రభుత్వ విభాగాలు పాల్గొన్నాయి. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట హాట్ టాపిక్ గా (Viral) మారింది.
Viral: రూ.45 వేల కరెంట్ బిల్! ఇక కాండిల్సే వాడతానంటూ కామెంట్! జరిగిందేంటంటే..
నాసాకు చెందిన ప్లానెటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ ఆఫీస్, ఫెడరల్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. భూమీని గ్రహశకలం ఢీకొనే అవకాశం 72 శాతం ఉంటే ఏం చేయాలనే దానిపై చర్చించామని నాసా ఓ ప్రకటనలో తెలిపింది. గ్రహశకలం ఢీకొన్న ప్రభావం ఓ ప్రాంతం నుంచి దేశవ్యాప్తంగా ఉంటే ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టామని చెప్పింది. గ్రహశకలాల ముప్పును ఎదుర్కొనే సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఈ తరహా పరీక్ష పెట్టినట్టు పేర్కొంది (tabletop exercise conducted by NASA to identify the challenges and gaps that exist in such a situation).
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ఏజెన్సీలు పలు సూచనలు చేశాయి. ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందకు గ్రహశకలానికి సంబంధించి మరింత సమాచారం కావాలని అభిప్రాయపడ్డాయి. దీంతో, భూమివైపు దూసుకొచ్చే వాటిని అధ్యయనం చేసేందుకు తక్షణ ప్రయోగానికి అనుకూలమైన వ్యోమనౌక సిద్ధం చేయాలని నాసాతో పాటు అమెరికా ప్రభుత్వం కూడా అంచనాకు వచ్చింది. వ్యోమనౌకలో అత్యాధునిక టెలిస్కోప్ వంటివి అందుబాటులో ఉండాలని కూడా ఈ సందర్భంగా వారు తీర్మానించారు. గ్రహశకలానికి సమీపంగా వెళ్లడం, అవసరమైతే దానిపై దిగేలా వ్యోమనౌక ఉండాలని నిర్ణయించాయి.
భూమీ వైపు వచ్చే గ్రహశకలాలను దారి మళ్లించేందుకు నాసా ఇప్పటికే కైనెటిక్ ఇంపాక్ట్ అనే సాంకేతికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఓ వ్యోమనౌకను గ్రహశకలంతో ఢీకొట్టించి దాని దిశ మారేలా చేస్తారు. అయితే, ఈ టెక్నాలజీ తోపాటు అదనపు సాంకేతికతలను అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవస్యకతను ఈ కార్యక్రమం తెలియజేసిందని నాసా తన ప్రకటనలో పేర్కొంది. ఇక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ప్రస్తుతం యావత్ భూమికి నష్టం కలిగించేంతట గ్రహశకలాలేవీ లేవు. అయితే, చిన్న చిన్న వాటివల్ల ప్రాంతీయంగా నష్టం కలిగే అవకాశం లేకపోలేదు. దీని కోసమే నానా కైనెకిట్ ఇంపాక్ట్ సాంకేతికతను అభివృద్ధి చేసింది.