Share News

Viral Video: వామ్మో.. ఇది చాలా గొప్ప ట్యాలెంట్.. ఇంత స్పీడ్‌గా రివర్స్ చేయగల కెపాసిటీ ఎవరికీ ఉండదు..!

ABN , Publish Date - Jul 01 , 2024 | 10:19 AM

కారు లేదా ఏదైనా వాహనాన్ని రివర్స్ చేయడం అనేది కాస్త జాగ్రత్తగా చేయాల్సిన పని. వెనుక వైపు చూసి లేదా అద్దంలో చూసుకుని నెమ్మదిగా రివర్స్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం రివర్స్ కెమేరాలు వచ్చాయి కాబట్టి రివర్స్ చేయడం కాస్త సులభంగా మారింది. అయినా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే.

Viral Video: వామ్మో.. ఇది చాలా గొప్ప ట్యాలెంట్.. ఇంత స్పీడ్‌గా రివర్స్ చేయగల కెపాసిటీ ఎవరికీ ఉండదు..!
Auto racing

కారు లేదా ఏదైనా వాహనాన్ని రివర్స్ చేయడం అనేది కాస్త జాగ్రత్తగా చేయాల్సిన పని. వెనుక వైపు చూసి లేదా అద్దంలో చూసుకుని నెమ్మదిగా రివర్స్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం రివర్స్ కెమేరాలు వచ్చాయి కాబట్టి రివర్స్ చేయడం కాస్త సులభంగా మారింది. అయినా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. అయితే అలాంటి టెక్నాలజీ అందుబాటులో లేని ఆటోను (Auto) రివర్స్ చేసేటపుడు వెనక్కి చూసి రివర్స్ చేయాల్సిందే. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ ఆటో డ్రైవర్ (Auto Driver) ట్యాలెంట్ చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే (Viral Video).


racing_club_sangli అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో బైక్ రేసింగ్ (Racing) జరుగుతోంది. బైక్‌లు ఒకదాని వెనుక ఒకటి వేగంగా వెళ్తున్నాయి. అయితే ఆ బైక్‌ల మధ్యలో ఓ ఆటో అతి వేగంగా వెళ్తోంది. విశేషమేమిటంటే.. ఆ ఆటో రివర్స్‌లో వెళుతోంది. బైక్‌లతో సమాన వేగంగా ఆటో రివర్స్‌లో వేగంగా వెళుతోంది. ఆటో డ్రైవర్ వెనక్కి చూస్తూ అతి వేగంగా ఆటోను నడుపుతున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు మిలియన్ల మంది వీక్షించారు. 9.5 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఇది ``ఫార్ములా వన్ రేసింగ్``, ``ఆ ఆటో డ్రైవర్ ట్యాలెంట్‌కు సలాం``, ``ఏమైనా తేడా జరిగితే చాలా పెద్ద ప్రమాదం తప్పదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీరు నిజంగా తెలివైన వాళ్లు అయితే.. ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ నీరు తెస్తున్నారో 9 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: అధిక తెలివితేటలంటే ఇవే.. ఈ ఫ్యాన్‌ను ఆపాలంటే కరెంట్ పోవాల్సిందే..షాకవుతున్న నెటిజన్లు!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 02 , 2024 | 09:20 AM