Share News

Viral Video: ఆటోని ఇల్లు ఎక్కించాడు.. అతడు ఎందుకలా చేశాడో తెలిస్తే ప్రశంసించకుండా ఉండలేరు..!

ABN , Publish Date - May 25 , 2024 | 10:08 AM

ధనికుడు, పేదవాడు ఎవరైనా సరే.. తమ తాహతుకు తగినట్టు స్వంత ఇల్లు కట్టుకోవాలని అందరూ కోరుకుంటారు. పేదవాడు ఎన్నో సంవత్సరాలు కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసి తన స్వంత ఇంటి కలను సాకారం చేసుకుంటాడు. అందరిలాగానే ఆ వ్యక్తి కూడా ఆటో నడుపుకుంటూ డబ్బులు పొదుపు చేసుకుని ఇంటిని కట్టుకున్నాడు.

Viral Video: ఆటోని ఇల్లు ఎక్కించాడు.. అతడు ఎందుకలా చేశాడో తెలిస్తే ప్రశంసించకుండా ఉండలేరు..!
Auto on House

ధనికుడు, పేదవాడు ఎవరైనా సరే.. తమ తాహతుకు తగినట్టు స్వంత (House) ఇల్లు కట్టుకోవాలని అందరూ కోరుకుంటారు. పేదవాడు ఎన్నో సంవత్సరాలు కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసి తన స్వంత ఇంటి కలను సాకారం చేసుకుంటాడు. అందరిలాగానే ఆ వ్యక్తి (Auto driver) కూడా ఆటో నడుపుకుంటూ డబ్బులు పొదుపు చేసుకుని ఇంటిని కట్టుకున్నాడు. తనకు సంపాదన అందించి పెట్టిన ఆటోను (Auto) ఏకంగా తన ఇంటిపై పెట్టుకున్నాడు. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అతడిపై ప్రశంసలు కురిపించారు (Viral Video).


aryantyagivlogs అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఇంటి మీదకు క్రేన్ సహాయంతో ఆటోను ఎక్కిస్తున్నారు. ఇంటి డాబాపై ప్రత్యేకంగా నిర్మించిన స్లాబ్‌పై ఆటోను నిలబెట్టి ఉంచారు. తన సొంతింటి కల నేరవేర్చిన ఆటోను తన జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకంగా ఉంచుకోవాలనుకున్నాడు. అన్ని దిక్కులా కనిపించేలా తన ఇంటిపై ఎత్తైన ప్రదేశంలో ఆటోను పెట్టించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Auto on House).


ఈ వైరల్ వీడియోకు ఇప్పటివరకు 2.7 కోట్ల వ్యూస్ వచ్చాయి. 16 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``జీవనోపాధిని గౌరవించాలి. అది అందరికీ మంచిది``, ``అతడికి అంతా మంచే జరుగుతుంది``, ``ఆ ఆటో డ్రైవర్‌కు సలాం``, ``అతడు తన కష్టాన్ని గౌరవించకున్నాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇదెక్కడి సరదా.. వరుడిని బైక్‌తో సహా పైకి లేపి డ్యాన్స్.. ఏం జరిగిందో చూడండి..!


Viral Video: వామ్మో.. ఈ చిరుత వేగం చూస్తే మన కళ్లు తిరగడం ఖాయం.. వేట కోసం చిరుత ఎలా పరిగెత్తిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 25 , 2024 | 10:08 AM