bald in men: మగవాళ్లలోనే బట్టతల రావడానికి కారణం ఏంటి? వైద్యులు చెప్పిన నిజాలు ఇవీ..!
ABN , Publish Date - Aug 07 , 2024 | 02:15 PM
బట్టతల ఆడవారికి కూడా వస్తుంది. కానీ ఇది ఎక్కువగా అబ్బాయిలలోనే కనిపిస్తుంది. మగవారిలోనే బట్టతల సమస్య ఎక్కువ రావడానికి..
జుట్టు మగవాళ్లకు, ఆడవారికి కూడా ముఖ్యమే.. ఒత్తుగా, పొడవుగా జుట్టు పెరిగితే అమ్మాయిలకు ఎంత ఇష్టమూ.. తల నిండుగా జుట్టు ఉంటే అబ్బాయిలకు కూడా అంతే ఇష్టం. కానీ బట్టతల అనే సమస్య చాలామందిని జుట్టు ఒత్తుగా ఉండాలనే కలను చిదిమేస్తుంది. బట్టతల ఆడవారికి కూడా వస్తుంది. కానీ ఇది ఎక్కువగా అబ్బాయిలలోనే కనిపిస్తుంది. మగవారిలోనే బట్టతల సమస్య ఎక్కువ రావడానికి కారణాలు ఏంటో వైద్యులు బయట పెట్టారు. అవేంటో తెలుసుకుంటే..
Vakkaya: వాక్కాయ దొరికితే అస్సలు వదలకండి.. వీటిని తింటే ఎన్ని లాభాలు ఉంటాయంటే..!
బట్టతలకు కారణాలు..
బట్టతల రావడానికి డైహెడ్రోటెస్టోస్టరాన్ కారణం అవుతుంది. ఇది మగ సెక్స్ హార్మోన్. దీనిని ఆండ్రోజెన్ అని కూడా పిలుస్తారు. ఆండ్రోజన్ హార్మోన్ జుట్టు పెరుగుదలను కూడా నియంత్రిస్తుంది. మగవారిలో ఈ ఆండ్రోజన్ స్థాయిలు పెరిగినప్పుడు జుట్టుపెరుగుదలలో నియంత్రణ ఏర్పడుతుంది. కొత్త జుట్టు పెరుగుదల లేకపోవడం వల్ల ఉన్న జుట్టు క్రమంగా ఊడిపోతూ బట్టతలకు దారితీస్తుంది. ఈ కారణంగానే మగవారిలో బట్టతల రావడాన్ని ఆండ్రోజెనిక్ అలోపేసియా అని అంటారు.
నియంత్రణ..
బట్టతల రాకుండా నియంత్రించడానికి ఇప్పట్లో మెడిసిన్ కూడా అందుబాటులో ఉంది. వైద్యుల సూచన మేరకు బట్టతల పూర్తీగా రాకమునుపే ఇవి వాడటం వల్ల దీన్ని నియంత్రించవచ్చు. ఇది మాత్రమే కాకుండా గుమ్మడి గింజల నూనే కూడా బట్టతలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెంచితే నష్టాలు తప్పవు..!
షాంపూ..
బట్టతల రాకుండా ఉండటానికి టీట్రీ, గ్రీన్ టీ, రోజ్మేరీ వంటి సారం ఉన్న షాంపూలను ఉపయోగించాలి. ఇవి జుట్టు బలహీనం కాకుండా కాపాడతాయి. అయితే షాంపూలో సల్ఫేట్, పారాబెన్ ఉండకూడదు.
ఇతర కారణాలు..
తీసుకునే ఆహారం, జీవనశైలి, అలవాట్లు కూడా బట్టతలకు కారణం అవుతాయి. పోషకాల కొరత ఉంటే జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. జుట్టు సంరక్షణ చర్యలు కూడా తీసుకోవాలి. విటమిన్-సి, విటమిన్-ఇ ఉన్న ఆహారాలు బాగా తీసుకోవాలి.
నెయ్యితో మసాజ్ చేస్తే యవ్వనంగా మారతారా? ఆయుర్వేదం చెప్పిన నిజాలివీ..!
ఈ సమస్యలున్నవారు అవిసె గింజలు పొరపాటున కూడా తినకూడదు..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.