Share News

Viral: ఈ ఆటో డ్రైవర్ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ప్యాసింజర్లకు కన్నడం ఎలా నేర్పుతున్నాడంటే..

ABN , Publish Date - Oct 22 , 2024 | 08:38 AM

బెంగళూరు, ముంబై, చెన్నై వంటి నగరాలకు ఉద్యోగాల కోసం వెళ్లే వారు ఇతరులతో మాట్లాడేందుకు ఇబ్బందులు పడుతుంటారు. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చాడు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral: ఈ ఆటో డ్రైవర్ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ప్యాసింజర్లకు కన్నడం ఎలా నేర్పుతున్నాడంటే..
Learn Kannada With Auto Kannadiga

మన దేశం ఎన్నో భాషల, ఎన్నో మతాల, ఎన్నో కులాల సమాహారం. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళితే భాషతో సహా ఎన్నో విషయాలు చాలా కొత్తగా ఉంటాయి. మిగతా విషయాల సంగతెలా ఉన్నా భాష (Language) విషయంలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బెంగళూరు, ముంబై, చెన్నై వంటి నగరాలకు ఉద్యోగాల కోసం వెళ్లే వారు ఇతరులతో మాట్లాడేందుకు ఇబ్బందులు పడుతుంటారు. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు బెంగళూరు (Bengaluru)కు చెందిన ఓ ఆటో డ్రైవర్ (Auto driver) వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చాడు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral News).


@vatsalyatandon అనే ట్విటర్ యూజర్ ఈ ఫొటోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ ఫొటో ప్రకారం.. ఆటో డ్రైవర్ వెనుక సీటుకు ఓ బోర్డ్ తగిలించి ఉంది. ఆ బోర్డు మీద ఇంగ్లీష్ వాక్యాలకు కన్నడ అనువాదం ఉంది. సాధారణంగా ఆటో డ్రైవర్‌తో ప్యాసింజర్లు మాట్లాడే మాటలకు కన్నడ (Kannada) అనువాదం ఉంది. పైన ఆంగ్లంలో వాక్యాలు రాసి, కింద వాటి కన్నడ అనువాదం రాశారు. ``సర్, డ్రైవ్ ఏ లిటిల్ ఫాస్టర్``, ``సర్, హౌ మచ్ ఈజ్ ఇట్``, ``డూ యాక్సెప్ట్ యూపీఐ ఆర్ క్యాష్ ఓన్లీ`` వంటి వాక్యాలను కన్నడలో ఎలా పలకాలో బోర్డు మీద రాసి దానిని ప్యాసింజర్లకు కనబడేలా తన సీటు వెనుక తగిలించాడు.


వాత్సల్య అనే ప్యాసింజర్ దానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ``చాలా ఉపయోగకరం`` అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 24 లక్షల కంటే ఎక్కువ మంది ఆ పోస్ట్‌ను వీక్షించారు. 30 వేల మందికి పైగా ఆ పోస్ట్‌ను లైక్ చేశారు. ఈ పోస్ట్‌పై కొందరు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``నో సర్, 2 కిలోమీటర్లకు రూ.600 చెల్లించలేను అని ఎలా చెప్పాలో ఇక్కడ రాయలేదు``, ``అంతా బాగానే ఉంది. కానీ, ప్రతి వాక్యం ముందు ``సర్, సర్`` అని ఉందేంటి. ఆటో డ్రైవర్‌తో కాకుండా బాస్‌తో మాట్లాడుతున్నట్టు ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Picture Puzzle: మీ ఐక్యూ లెవెల్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో ఎన్ని పుచ్చకాయలు ఉన్నాయో చెప్పండి..


Viral: రాజస్థాన్‌లో నిల్చుని మధ్యప్రదేశ్‌లో టిక్కెట్ తీసుకోవాలి.. ఆ రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుని అమితాబ్ కూడా షాక్..

Viral video: భయంకర ప్రమాదం.. ఎలక్ట్రిక్ వైర్ తెగి నీటిలో పడడంతో ఏం జరిగిందో చూడండి.. వీడియో వైరల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 22 , 2024 | 08:38 AM