Share News

Viral Video: రోడ్డు పక్కన ఎలుగుబంటి.. కారులో వెళ్తున్న వారికి ఎలాంటి షాకిచ్చిందో చూడండి.. వీడియో వైరల్..

ABN , Publish Date - Oct 02 , 2024 | 11:08 AM

పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు వంటి క్రూర మృగాలకు సంబంధించిన ఆసక్తికర, ఫన్నీ వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఎలుగుబంటికి సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Viral Video: రోడ్డు పక్కన ఎలుగుబంటి.. కారులో వెళ్తున్న వారికి ఎలాంటి షాకిచ్చిందో చూడండి.. వీడియో వైరల్..
Bear

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు (Wild Animals) సంబంధించిన వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు వంటి క్రూర మృగాలకు సంబంధించిన ఆసక్తికర, ఫన్నీ వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఎలుగుబంటికి సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (Viral Video).


pubity అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం అడవి మధ్య నుంచి వేసిన ఓ జాతీయ రహదారి గుండా ఓ కారు (Car) వెళ్తోంది. ఆ సమయంలో ఓ ఎలుగుబంటి (Bear) రోడ్డు దాటి వెళ్తోంది. రోడ్డు పక్కకు వెళ్లిన తర్వాత రెండు కాళ్లపై కూర్చుంది. కారులోని వారిని చూసి చేతులు గాల్లోకి ఊపింది. లిఫ్ట్ అడిగినట్టు చేయి ఊపింది. దీంతో ఆ కారులోని వారు ఆశ్చర్యపోయారు. ఆ ఘటన మొత్తాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 25 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 4 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ ఎలుగుబంటి లిఫ్ట్ అడుగుతోంది``, ``ఆ ఎలుగుబంటి సాధారణంగా ఉండడానికి ప్రయత్నిస్తోంది``, ``జాగ్రత్తగా వెళ్లమని చెబుతోంది``, ``ఎలుగుబంటిని చూసి కారు అద్దం కిందకు దించడం నిజంగా క్రేజీ``, ``ఆ ఎలుగుబంటికి సహాయం కావాలేమో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: బలం ఉందని విర్రవీగితే ఇంతే.. చీమల దెబ్బకు కొండచిలువ పరిస్థితి ఏమైందో చూడండి.. వీడియో వైరల్..


Optical Illusion: మీ అబ్జర్వేషన్ స్కిల్స్‌కు టెస్ట్.. ఈ రెండు ఫొటోల్లోని తేడాలను 10 సెకెన్లలో పట్టుకోండి..


Viral Video: వేగంగా వెళ్తున్న బైక్‌పై విన్యాసాలు.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఏమైందంటే..


Viral Video: ఇంక వీళ్లు మారరా..? మెట్రో రైలులో యువతి డ్యాన్స్ వీడియో వైరల్.. నెటిజన్ల రియాక్షన్స్ ఏంటంటే..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 02 , 2024 | 11:08 AM