Share News

Viral: అమెజాన్‌లో రూ.కోటి జీతంతో జాబ్.. రిజైన్ చేసి మరీ సొంత సంస్థ పెడితే..

ABN , Publish Date - Dec 31 , 2024 | 03:12 PM

రూ.కోటీ జీతమిచ్చే అమెజాన్ జాబ్ కాదనుకుని ఓ వ్యక్తి సొంత సంస్థను ఏర్పాటు చేసే ప్రయత్నంలో వరుస ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వచ్చే ఏడాది అయినా తనకు విజయం రావాలని ఆశిస్తూ అతడు నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Viral: అమెజాన్‌లో రూ.కోటి జీతంతో జాబ్.. రిజైన్ చేసి మరీ సొంత సంస్థ పెడితే..

ఇంటర్నెట్ డెస్క్: ఇదీ స్టార్టప్ యుగం. లక్షలాది రూపాయలు జీతంగా తీసుకుంటున్న ఎందరో యువ టెకీలు తామూ ఓ సంస్థ పెడదామని ప్రయత్నిస్తు్న్నారు. ఇప్పటికే విజయాలు సాధించిన స్టార్టప్ సంస్థల స్ఫూర్తితో రంగంలోకి దిగుతున్నారు. బెంగళూరుకు చెందిన ఓ టెకీ కూడా సరిగ్గా ఇదే చేశారు. అమెజాన్‌లో ఏటా రూ.కోటి శాలరీతో చేస్తున్న ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి సొంత సంస్థను స్థాపించారు. అది మొదలు తాను ఎదుర్కొన్న మలుపులను ఈ ఏడాది చివరి రోజున నెట్టింట పంచుకున్నారు. వచ్చే సంవత్సరమైనా తనకు విజయం రావాలని ఆకాంక్షిస్తూ ఆయన పెట్టి పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది (Viral).

శక్తిమణి త్రిపాఠీ తను ఎదుర్కొంటున్న ఒడిదుడుకులను నెట్టింట పంచుకున్నారు. సొంత సంస్థ స్థాపించాలన్న ఆలోచన తనను నిలవనీయక పోవడంతో ఈ రంగంలోకి వచ్చినట్టు చెప్పుకొచ్చారు. ‘‘2024 నన్ను ఓ ఊపు ఊపేసింది’’ అని వివరించారు.

Viral: పబ్‌లో నూతన సంవత్సర వేడుకలు.. అతిథులకు కండోమ్స్‌ గిఫ్ట్‌గా పంపి ఆహ్వానాలు!


తన తొలి స్టార్టప్ సంస్థ హూబహూ ఏఐ అని వివరించారు. తన ఐడియాను మొత్తం 30 మంది వెంచర్ క్యాపిటలిస్టులకు చూపించినా నిధుల సమీకరణ సాధ్యం కాలేదని అన్నారు. కొత్త కస్టమర్లను అందిపుచ్చుకునేందుకు భారీగా ఖర్చవుతుండటంతో చివరకు దాన్ని పక్కనపెట్టేసినట్టు చెప్పారు.

రెండో ప్రయత్నంలో టెకీల ఉత్పాదకతలను ముదింపువేసే ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినా, కొన్ని అంశాలను లెక్కించే క్రమంలో ఎదురైన సంక్లిష్టతల దృష్ట్యా దాన్నీ పక్కపెట్టేసినట్టు తెలిపారు. ఆ తరువాత కార్డమమ్ ఏఐ అనే ఉత్పత్తిని లాంచ్ చేసినా మార్కెట్లో అప్పటికే పోటీ ఎక్కువగా ఉండటంతో దీన్నీ పక్కనపెట్టేయాల్సి వచ్చిందని వివరించారు.

Viral: నీటి ప్రవాహాన్ని దాటేందుకు వంతెన నిర్మించిన చీమలు! వైరల్ వీడియో!


ప్రస్తుతం బిజినెస్ ఫ్లోస్‌ను ఆటోమేట్ చేసేందుకు ఉద్దేశించిన రిఫ్లెక్ ఏఐని స్థాపించినట్టు చెప్పుకొచ్చారు. ముగ్గురు క్లైంట్ల నుంచి ఆసక్తి వ్యక్తమైనా కూడా వైకాంబినేటర్‌కు చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైందని అన్నారు. 2025లో అయినా తనకు విజయం దక్కాలని, ఉద్యోగిగా మారకుండా సంస్థ అధిపతిగా ఎదిగే అవకాశం రావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది అతడిని అభినందించారు. పట్టువిడవకుండా ప్రయత్నించాలని ప్రోత్సహించారు. ఏదోక రోజు విజయం తప్పక సిద్ధిస్తుందని భరోసా ఇస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Viral: చెత్త కుండీలో కరెన్సీ నోట్ల కట్టలు.. అసలు విషయం తెలియక పిల్లల్లో సంబరం!

Read Latest and Viral News

Updated Date - Dec 31 , 2024 | 03:17 PM