Share News

Viral: ఫ్రెండ్ భార్య కోసం పండ్ల వ్యాపారి చోరీలు! ఎందుకుని పోలీసులు అడిగితే..

ABN , Publish Date - Jul 26 , 2024 | 08:26 PM

స్నేహితుడి భార్య కోసం దొంగతనాలకు దిగిన ఓ పండ్ల వ్యాపారి పోలీసులకు చిక్కాడు. అతడు దొంగతనాలు ఎందుకు చేస్తోందీ తెలుసుకుని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. కర్ణాటకకు చెందిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది.

Viral: ఫ్రెండ్ భార్య కోసం పండ్ల వ్యాపారి చోరీలు! ఎందుకుని పోలీసులు అడిగితే..

ఇంటర్నెట్ డెస్క్: స్నేహితుడి భార్య కోసం దొంగతనాలకు దిగిన ఓ పండ్ల వ్యాపారి పోలీసులకు చిక్కాడు. అతడు దొంగతనాలు ఎందుకు చేస్తోందీ తెలుసుకుని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఇటీవలే జైలు నుంచి విడుదలై మళ్లీ దొంగతనాలు మొదలెట్టిన అతడి ఉదంతం ప్రస్తుతం స్థానికంగానే కాకుండా నెట్టింట కూడా వైరల్‌గా (Viral) మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సొలదేవనహళ్లికి చెందిన అశోక్ (33) కూరగాయలు అమ్ముకుంటూ ఉంటాడు. గతంలో పలు నేరాలు చేసిన అతడు నెల రోజుల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే, అతడి నేర చరిత్ర కారణంగా భార్య వదిలి వెళ్లిపోయింది. దీంతో, అతడు స్నేహితుడి ఇంట్లో తలదాచుకుంటున్నాడు. ఇటీవల మళ్లీ దొంగతనాలు మొదలెట్టిన అతడు పోలీసులకు చిక్కాడు. ఎందుకిలా చేశావని అడగ్గా అతడి సమాధానం విని ఆశ్చర్యపోయాడు.

Viral: రెండేళ్ల క్రితం తిన్న మిరపకాయ ఎంత పని చేసిందీ! ఇతడి పరిస్థితి చూస్తే..


అశోక్ స్నేహితుడి భార్య బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది. కష్టాల్లో ఉన్న ఆ జంటను ఆదుకునేందుకు అశోక్ తను దొంగతనాల ద్వారా సంపాదించిన డబ్బును ఖర్చు చేశాడు. మరింత డబ్బు అవసరం కావడంతో మళ్లీ దొంగతనాలకు దిగాడు. అతడు ప్రధానంగా పల్సర్, కేటీఎమ్ బైకులను మాత్రమే చోరీ చేసేవాడు. అశోక్ అతడి స్నేహితుడు కూడా సహకరించాడు. నిందితులు తాము చోరీ చేసిన బైకులను బైయ్యదారహళ్లిలోని ఓ ఖాళీ ప్రదేశంలో దాచిపెట్టేవారు. బేరాలు కుదరగానే అమ్మేసేవారు.

ఈ నేపథ్యంలో ఓ బైక్ చోరీ కేసును పరిశోధిస్తున్న పోలీసులకు నిందితులు అడ్డంగా దొరికిపోయారు. ఇద్దరి నుంచి రూ.10.7 లక్షల విలువైన బైకులను స్వాధీనం చేసుకున్నారు. కాగా, అశోక్‌పై 15 క్రిమినల్ కేసులు ఉండగా నెలక్రితమే అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. అతడి స్నేహితుడికి హత్య, దోపిడీ, చెయిన్ సహా మొత్తం 40 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. తాము చోరీ చేసిన బైకులను కొనుగోలు చేసేవారి కోసం నిందితులు వెతుకుతుండగా పోలీసులకు పట్టుబడ్డారు. బైక్ చోరీలతో పాటు రాత్రుళ్లు తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో కూడా దొంగతనాలు చేసినట్టు నిందితులు అంగీకరించారు. దీంతో, అశోక్ దొంగతనాల వెనక కారణం తెలిసి స్థానికులు కూడా షాకైపోతున్నారు.


ఇదిలా ఉంటే రాజస్థాన్‌‌కు చెందిన బాబూరామ్ భిల్ బతికుండగానే అతడు చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ జారీ అయ్యింది. తప్పును సరిదిద్దేందుకు అతడు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో, తాను బతికున్నానని నిరూపించుకునేందుకు నేరాల బాటపట్టాడు. బలోత్రా జిల్లాలో స్థానికులపై దాడులకు దిగాడు. చివరకు పోలీసులకు చిక్కడంతో అతడు కోరిక నెరవేరింది.

Read Viral and Telugu News

Updated Date - Jul 26 , 2024 | 08:26 PM