CyberCrime: రెండు రోజుల్లో రూ. కోటి కోల్పోయిన మహిళా టెకీ.. ఆమె పొరపాటు ఏంటంటే..
ABN , Publish Date - May 23 , 2024 | 08:40 PM
బెంగళూరుకు చెందిన ఓ మహిళా టెకీ తాజాగా సైబర్ నేరగాళ్ల బారిన పడింది. వారు మాటలు నిజమని భయపడి ఏకంగా రూ. కోటి రూపాయలు నష్టపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరుకు (Bengaluru) చెందిన ఓ మహిళా టెకీ తాజాగా సైబర్ నేరగాళ్ల బారిన పడింది. వారు మాటలు నిజమని భయపడి ఏకంగా రూ. కోటి రూపాయలు నష్టపోయింది. ఫెడ్ ఎక్స్ స్కామ్ కు బలైన వారి జాబితాలో చేరింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బాధితురాలు బెంగళూరు ఈస్ట్‌లోని రామమూర్తినగర్ కు సమీపంలోని ఎన్నారై లేఅవుట్‌లో ఉంటున్నారు. ఇటీవల ఆమెకు ఫెడ్స్ కొరియర్ సంస్థ పేరిట నిందితులు ఆమెకు కాల్ చేశారు. ఆమె పేరిట ఓ తైవాన్ కు వెళ్లాల్సిన ఓ కొరియర్ ను ముంబై ఎయిర్ పోర్టులో పోలీసులు సీజ్ చేసినట్టు చెప్పారు. పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని ఆమెను బెదిరించారు (Bengaluru Woman Falls Prey To FedEx Scam Loses Rs 1 Crore To Cybercriminals In Two Days).
Viral: వామ్మో.. బైక్‌ను ఇలాక్కూడా వాడొచ్చా.. ఏం తెలివిరా బాబూ..
ఆ తరువాత కస్టమ్స్ అధికారులమంటూ మరికొందరు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. పార్సిల్‌లో డ్రగ్స్ తో పాటు పాస్‌పోర్టులు, దుస్తులు కనిపించాయని, కస్టమ్స్ ఎంక్వైరీ ప్రారంభమైందని చెప్పారు. మరో నిందితుడు ఫోన్ చేసి నార్కోటిక్స్ కేసులో ఆమె పాత్ర ఉందని ఆరోపిస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. చివరకు ఆమెకు స్కైప్ కాల్‌లో బలవంతంగా మాట్లాడించి తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నారు. ఆన్‌లైన్‌లోనే ఇంటరాగేషన్ జరుగుతున్నట్టు బెదిరిస్తూ ఆమెకు చుక్కులు చూపించారు.
ఈ కేసులోంచి బయటపడేందుకు వెరిఫికేషన్‌కు సహకరించాలని బాధితురాలిని భయపెట్టారు. వెరిఫికేషన్ కోసం డబ్బులను ఆర్బీఐకి పంపించాలంటూ ఆమెతో ఏకంగా రూ.కోటి బదిలీ చేయించుకున్నారు. వెరిఫికేషన్ తరువాత డబ్బులు తిరిగిచ్చేస్తామన్న నిందితులు ఆ తరువాత ముఖం చాటేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.