Share News

Bengaluru: బెంగళూరులో అంతే మరి.. ఇంటి అద్దెతో సమానంగా క్యాబ్ ఛార్జీలు.. ఓ మహిళ పెట్టిన పోస్ట్ ఏంటంటే..

ABN , Publish Date - Jul 27 , 2024 | 09:20 AM

టెక్ హబ్ అయిన బెంగళూరులో నివసించడం సామాన్యులకు అంత సులభం కాదు. లక్షల్లో సంపాదించే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఎక్కువగా నివసించే బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. ఇతర మెట్రో నగరాలతో పోల్చుకుంటే రేట్లు అన్నీ కళ్లు చెదిరేలా ఉంటాయి.

Bengaluru: బెంగళూరులో అంతే మరి.. ఇంటి అద్దెతో సమానంగా క్యాబ్ ఛార్జీలు.. ఓ మహిళ పెట్టిన పోస్ట్ ఏంటంటే..
Uber Cab

టెక్ హబ్ అయిన బెంగళూరు (Bengaluru)లో నివసించడం సామాన్యులకు అంత సులభం కాదు. లక్షల్లో సంపాదించే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఎక్కువగా నివసించే బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ (Cost of living) చాలా ఎక్కువ. ఇతర మెట్రో నగరాలతో పోల్చుకుంటే రేట్లు అన్నీ కళ్లు చెదిరేలా ఉంటాయి. అద్దెకు ఇల్లు దొరకడమే కష్టం, ఒకవేళ దొరికినా రెంట్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మహిళ ఆశ్చర్యకర విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది (Viral News).


బెంగళూరులో ట్రాఫిక్‌ ఎలా ఉంటుందో దేశమంతా తెలిసిందే. ముఖ్యంగా ఆఫీసు సమయాల్లో ఉద్యోగులు ట్రాఫిక్‌లో నరకం చూస్తుంటారు. ఆఫీస్‌లకు వెళ్లేందుకు చాలా మంది క్యాబ్‌లనే ఆశ్రయిస్తుంటారు. అయితే బెంగళూరులో క్యాబ్ ఛార్జీలు (Cab Charges) ఏ రేంజ్‌లో ఉంటాయో వెల్లడిస్తూ ఓ మహిళ ట్వీట్ చేసింది. వన్షిత అనే ఉద్యోగిని రోజూ ఆఫీసుకు వెళ్లే క్రమంలో ఉబర్‌ (Uber) క్యాబ్‌ను ఆశ్రయిస్తోంది. ఈ నేపథ్యంలో తను క్యాబ్ కోసం ఎంత ఖర్చుపెడుతోందో ట్రాక్ చేసింది. దీంతో ఆమెకు కళ్లు బైర్లు కమ్మే నిజాలు తెలిశాయి.


ఈ నెల 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆమె మొత్తం 73 సార్లు ఉబర్ క్యాబ్‌లు ఎక్కింది. అందుకుగానూ ఆమె ఏకంగా రూ.16 వేలకు పైనే చెల్లించింది. తన ఇంటి అద్దెలో సగం కంటే ఎక్కువ క్యాబ్‌కే ఖర్చవుతోంది అంటూ వన్షిత సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రేంజ్‌లో చెల్లించేకంటే స్వంతంగా ఓ కారు కొనుక్కోవడం ఉత్తమం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Picture Puzzle: మీ అబ్జర్వేషన్ స్కిల్స్‌కు టెస్ట్.. కింది ఫొటోలో విభిన్నంగా ఉన్నఎమోజీని 10 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: అదృష్టం అంటే ఇదే.. కూర్చున్న వ్యక్తి లేచి పక్కకు వెళ్లగానే ఏం జరిగిందో చూడండి..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 27 , 2024 | 09:20 AM