Share News

HeatStroke: వడదెబ్బతో 108 డిగ్రీల జ్వరం.. వ్యక్తి దుర్మణం!

ABN , Publish Date - May 30 , 2024 | 09:55 PM

ఢిల్లీలో ఓ వ్యక్తి (40) వడ దెబ్బ కారణంగా దుర్మరణం చెందాడు. శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీలు చేరడంతో అవయవాలన్నీ విఫలమై కన్నుమూశాడు.

HeatStroke: వడదెబ్బతో 108 డిగ్రీల జ్వరం.. వ్యక్తి దుర్మణం!

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో (New Delhi) ఓ వ్యక్తి (40) వడ దెబ్బ కారణంగా దుర్మరణం చెందాడు. శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీలు చేరడంతో అవయవాలన్నీ విఫలమై కన్నుమూశాడు. బీహార్ ‌లోని దర్బంగాకు చెందిన బాధితుడు తీవ్ర జ్వరంతో బాధపడుతూ సోమవారం రాత్రి రాజధానిలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. అప్పటికే అతడి శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీలకు చేరుకుంది. శరీరంలోని అవయవాలు విఫలమయ్యాయి. ముఖ్యంగా, కిడ్నీ, లివర్ కు తీవ్ర ప్రభావం పడింది. అతడిని కాపాడేందుకు వైద్యులు ఎంత కష్టపడినా ఉపయోగం లేకపోయింది. బాధితుడు చికిత్స పొందుతూ అతడు మరణించినట్టు తెలిపారు.

గత కొద్ది రోజులుగా ఉత్తరాదిన.. ముఖ్యంగా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం సఫ్దర్‌జంగ్ ప్రాంతంలోని వాతావరణ కేంద్రం 46.8 డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదు చేసింది. గత 79 ఏళ్లలో ఇదే గరిష్ఠం. వేడి తట్టుకోలేక జనాలు అల్లాడిపోతున్నారు. రాజస్థాన్ నుంచి వేడి గాలులు వీస్తుండటతో రాజధానిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.

Viral: ఎండ నుంచి బిడ్డను కాపాడుకునేందుకు పావురాయి ప్రాణత్యాగం.. వైరల్ వీడియో!

Read National News and Latest News here

Updated Date - May 30 , 2024 | 10:01 PM