Share News

Viral Video: అదృష్టం బాగుంటే ఎవ్వరూ ఏం చేయలేరు.. ఆ కుర్రాడు ఎంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడో చూడండి..!

ABN , Publish Date - Aug 23 , 2024 | 12:46 PM

దేవుడి ఆశీర్వాదం ఉంటే.. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని అంటుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను చూస్తే పైన చెప్పిన మాటలను నమ్మకుండా ఉండలేరు. ఆ వీడియోలో ఓ బాలుడు అత్యద్భుతంగా ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

Viral Video: అదృష్టం బాగుంటే ఎవ్వరూ ఏం చేయలేరు.. ఆ కుర్రాడు ఎంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడో చూడండి..!
Road Accident

అదృష్టం (Luck) బాగుంటే సముద్రం మధ్యలో పడిపోయినా సరే ఎలాగోలా ఒడ్డుకు చేరుకుంటారనేది ఓ సామెత. అలాగే దేవుడి ఆశీర్వాదం ఉంటే.. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని కూడా అంటుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను చూస్తే పైన చెప్పిన మాటలను నమ్మకుండా ఉండలేరు. ఆ వీడియోలో ఓ బాలుడు అత్యద్భుతంగా ఓ పెద్ద ప్రమాదం (Road Accident) నుంచి తప్పించుకున్నాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. @HasnaZaruriHai అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి రోడ్డుపై కారులో వెళుతూ వీడియో తీస్తున్నాడు. అంతలో ఓ హై స్పీడ్ బైక్ ఆ కారును దాటి వెళ్లింది. ముందుకు వెళ్లి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దాంతో బైక్ నడుపుతున్న వ్యక్తి, వెనుక కూర్చున్న మహిళ కింద పడిపోయారు. బైక్ మాత్రం ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉంది. ఆ బైక్ మీద చిన్నారి బాలుడు ఉన్నాడు. ఆ బైక్ అలా దాదాపు అర కిలోమీటర్ దూరం వరకు ముందుకు వెళ్లింది. ఆ రోడ్డు మీద ఇతర వాహనాలు కూడా వెళ్తున్నాయి. అయినా ఆ బైక్ ఎవరూ నడపకుండానే ముందుకు వెళ్లి డివైడర్‌ను తగులుకుని ఆగిపోయింది. ఆ బైక్ మీద ఉన్న బాలుడు మొక్కల్లో పడ్డాడు.


మొక్కల్లో పడడంతో ఆ బాలుడికి చిన్న దెబ్బ కూడా తగల్లేదు. ఆ బాలుడి తల్లిదండ్రులు మాత్రం తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ రోడ్డు మీద వెళ్తున్న వారు వెంటనే స్పందించి వారిని హాస్పిటల్‌కు తరలించారు. ఈ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఇప్పటివరకు 4.9 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 3.2 వేల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: పాకిస్తాన్ బోర్డర్‌లో అరుదైన దృశ్యం.. సరిహద్దు అవతలి నుంచి ఎలా మాట్లాడుకున్నారో చూడండి..


Viral Video: బిజీ రోడ్డుపై డబ్బులు వెదజల్లిన యువకుడు.. తర్వాతేం జరిగిందో చూడండి.. వీడియో వైరల్!


IQ Test: మీ తెలివితేటలకు నిజమైన పరీక్ష.. ఈ సింపుల్ పజిల్‌ను 10 సెకెన్లలో సాల్వ్ చేయండి..!


Viral: ట్రక్ డ్రైవరే కానీ, మహానుభావుడు.. ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఇతడు నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 23 , 2024 | 12:46 PM