Share News

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. వరుసగా రోడ్డుపై పడిపోయిన బైకర్లు.. అసలేం జరిగిందంటే..

ABN , Publish Date - Jun 15 , 2024 | 11:13 AM

బైక్‌ల మీద అత్యంత వేగంగా వెళ్లే వాళ్లు అనేక ప్రమాదాలకు కారణమవుతుంటారు. తమ ప్రాణాల కంటే రేసింగ్‌కు లేదా సోషల్ మీడియా వ్యూస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఆ క్రమంలో తమ ప్రాణాలనే కాదు ఎదుటి వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పెడతారు.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. వరుసగా రోడ్డుపై పడిపోయిన బైకర్లు.. అసలేం జరిగిందంటే..
Bike accident

బైక్‌ల (Bike) మీద అత్యంత వేగంగా వెళ్లే వాళ్లు అనేక ప్రమాదాలకు కారణమవుతుంటారు. తమ ప్రాణాల కంటే రేసింగ్‌కు లేదా సోషల్ మీడియా వ్యూస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఆ క్రమంలో తమ ప్రాణాలనే కాదు ఎదుటి వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పెడతారు (Bike Racing). ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే భయాందోళనకు గురి కాక తప్పదు. ఆ వీడియోలో నలుగురు బైకర్లు బిజీ రోడ్డుపై పోటీ పెట్టుకున్నట్టు కనిపిస్తోంది (Viral Video).


yalazd3niz అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో నలుగురు వ్యక్తులు బిజీ రోడ్డుపై రేసింగ్‌కు వెళుతున్నట్టు తెలుస్తోంది. నాలుగు బైక్‌లు పక్క పక్కనే వెళుతున్నాయి. ఆ సమయంలో ఓ బైకర్ ముందు వెళ్తున్న రిక్షాను ఢీకొట్టి బ్యాలెన్స్ కోల్పోయి పక్కనే ఉన్న బైక్ మీద పడిపోయాడు. ఆ వ్యక్తి తన పక్క బైక్ మీద పడిపోయాడు. ఆ మూడో బైక్ ఏకంగా ట్రక్‌‌ను ఢీకొట్టి కింద పడిపోయింది. ఆ ట్రక్ ఆ బైక్ పై నుంచి వెళ్లిపోయింది. అయితే ఆ బైకర్ వేరే దిశలో పడిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.


ఇంత ప్రమాదకర యాక్సిడెంట్‌లో ప్రాణాపాయం జరగలేదు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తమ స్పందనలను తెలియజేశారు. ``ఇంత దారుణమైన నిర్లక్ష్యమా``, ``పట్టపగలు బిజీ రోడ్డుపై రేసింగ్ చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలి``, ``చిన్న తప్పు జీవితాలను తల్లక్రిందులు చేస్తుంది``, ``ఎవరూ ప్రాణాలు కోల్పోకపోవడం గొప్ప విషయం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ కళ్లకు నిజమైన పరీక్ష.. ఈ ఫొటోలో ఉన్న తప్పేంటో 10 సెకెన్లలో కనుక్కోండి..!


Viral Video: ఇలాంటి వాడి బైక్ ఎక్కిన ఆ అమ్మాయి ధైర్యానికి హ్యాట్సాఫ్.. వైరల్ అవుతున్న ప్రమాదకర స్టంట్ వీడియో!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 15 , 2024 | 11:13 AM