Viral: అకస్మాత్తుగా కారు సైరెన్లు మోగడంతో పోలీసులకు షాక్.. ఏం జరిగిందని ఆరా తీస్తే..
ABN , Publish Date - Apr 12 , 2024 | 07:20 PM
పోలీసుల కారు సైరెన్ మాదిరి శబ్దాలను చేసిన ఓ పక్షి జనాలు దిమ్మెరపోయేలా చేసింది. స్వయంగా బ్రిటన్ పోలీసులు ఈ విషయాన్ని నెట్టింట పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రామచిలక లాంటి పక్షులు మనుషుల మాటలను అనుకరించగలవన్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని పక్షులు మాటలతో పాటు ఇతర అనేక రకాల శబ్దాలను అనుకరించగలవు. అలాంటి ఓ పక్షి పోలీసులకే షాకిచ్చింది. బ్రిటన్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది. తమను ఆ పక్షి ఎలా ఇబ్బంది పెట్టిందీ పోలీసులు సోషల్ మీడియాలో వివరంగా చెప్పుకొచ్చారు.
Viral: ఈ జూలో ప్రతి శనివారం పులులకు ఉపవాసం.. ఎందుకో తెలిస్తే..
థేమ్స్ వ్యాలీ అనే చిన్న టౌన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, పోలీసుల కార్ల నిర్వహణకు సంబంధించి అక్కడ ఓ వర్క్ షాప్ ఉంది. అక్కడి సిబ్బంది పోలీసు కార్ల సైరెన్లను నిత్యం పరీక్షిస్తుంటారు. ఆ పరిసరాల్లో చెట్లపై బోలెడన్ని పక్షులు ఉంటాయి. ఇక సిబ్బంది కారు సైరెన్లను పరీక్షిస్తున్న సమయంలో ఓ పక్షి జాగ్రత్తగా వినింది. కొన్ని వారాల పాటు రకరకాల సౌండ్లను జాగ్రత్తగా విన్న ఆ పక్షి ఓ రోజు పోలీసులు కారు బయటకు తీసుకొస్తున్న సందర్భంగా సైరెన్ మోగినట్టు అరిచింది. పక్షి శబ్దం నిజంగా కారు సైరెన్‌లాగా ఉన్నట్టు అనిపించడంతో పోలీసులు కూడా ఒకింత షాకయ్యారు. కారులో ఏదైనా రిపేర్ వచ్చిందేమోనని అనుకున్నారు (Bird Leaves Police Officers Confused In UK By Copying Siren Sound).
Viral: మెట్రో రైళ్లల్లోనూ ఈ మరకలా.. నెటిజన్లలో పెల్లుబుకుతున్న ఆగ్రహం.. జరిగిందేంటంటే..
ఘటన గురించి తెలిసిన నెటిజన్లు పక్షి నేపుణ్యానికి ఆశ్చర్యపోయారు. పోలీసుల ఆ పక్షి ఫొటోను కూడా షేర్ చేయడంతో అది ఏ పక్షో తెలుసుకునేందుకు కొందరు ఉత్సుకత ప్రదర్శించారు. కొందరు యూజర్లు ఆ పక్షిని స్టార్లింగ్‌గా గుర్తించారు. ఇవి రకరకాల శబ్దాలను అద్భుతంగా అనుకరిస్తాయని అన్నారు. వాహనాల శబ్దాలే కాకుండా ఇతర పక్షుల శబ్దాలను కూడా యథాతథంగా తమ గొంతులో పలికించగలవని అన్నారు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి