Share News

Black Lips: పెదవులు నల్లగా ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయా? ఈ 5 టిప్స్ పాటిస్తే గులాబీ రెక్కల్లా మారిపోతాయ్..!

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:44 PM

పెదవులు నల్లబడటానికి అనేక కారణాలు ఉన్నాయి. నల్లగా ఉన్న పెదవులను తిరిగి గులాబీ రంగులో మృదువుగా మార్చడం అసాధ్యం అని చాలామంది అంటూ ఉంటారు. కానీ కొన్ని టిప్స్ ఉపయోగించి పెదవులను గులాబీ రెక్కల్లా మృదువుగా, అందంగా మార్చవచ్చు

Black Lips: పెదవులు నల్లగా ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయా? ఈ 5 టిప్స్ పాటిస్తే గులాబీ రెక్కల్లా మారిపోతాయ్..!

పెదవులు నల్లబడటానికి అనేక కారణాలు ఉన్నాయి. అధిక ధూమపానం లేదా కెఫిన్ వినియోగం కారణంగా పెదవులు నల్లబడతాయి. ఇవి మాత్రమే కాకుండా పెదవులు నల్లబడటానికి ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. ఇలా నల్లగా ఉన్న పెదవులను తిరిగి గులాబీ రంగులో మృదువుగా మార్చడం అసాధ్యం అని చాలామంది అంటూ ఉంటారు. కానీ కొన్ని టిప్స్ ఉపయోగించి పెదవులను గులాబీ రెక్కల్లా మృదువుగా, అందంగా మార్చవచ్చు. అదెలాగో తెలుసుకుంటే..

పెదవులు హైపర్పిగ్మెంటేషన్ వల్ల నల్లగా మారవచ్చు. ఇది సాధారణంగా అధిక మెలనిన్ వల్ల కూడా జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా.. సూర్యునికి అధికంగా బహిర్గతం కావడం, ఆర్ద్రీకరణ లేకపోవడం, సిగరెట్ తాగడం, టూత్‌పేస్ట్, లిప్‌స్టిక్, మొదలైనవాటి అలెర్జీ. చాలా ఎక్కువ కెఫిన్ తీసుకోవడం, పెదవులను పీల్చడం వంటివి కారణమవుతాయి.

ప్రపంచంలోనే మొట్టమొదటి బంగారంతో నిర్మించబడిన హోటల్ .. ఇందులో అద్దె ఎంతంటే..!


నలుపు పెదవులను గులాబీ రంగులోకి మార్చే చిట్కాలు..

నిమ్మ, చక్కెర..

నిద్రపోయే ముందు నిమ్మకాయ ముక్కను కట్ చేసి చక్కెరలో ముంచాలి. దీంతో పెదవుల మీద రుద్దాలి. ఆ తరువాత కడిగేయాలి. మరుసటి రోజు ఉదయం పెదాలను గోరువెచ్చని నీటితో కడగాలి.

నిమ్మ, తేనె..

1 1/2 స్పూన్ తాజా నిమ్మరసం

1 టీస్పూన్ తేనె

1 టీస్పూన్ గ్లిసరిన్

మూడింటిని కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని పెదవులపై సున్నితంగా అప్లై చేయాలి. తర్వాత మరుసటి రోజు ఉదయం పెదాలను కడగాలి.

భూమిపై ఉండే 8 అతిపెద్ద చెట్లు ఇవీ..!


అలోవెరా జెల్..

ప్రతిరోజూ ఒకసారి పెదాలకు తాజా కలబంద జెల్ అప్లై చెయ్యాలి. అది ఆరిన తర్వాత, గోరువెచ్చని నీటితో కడగాలి.

దానిమ్మ..

1 టేబుల్ స్పూన్ దానిమ్మ గింజలు

1 టీస్పూన్ రోజ్ వాటర్

1 టేబుల్ స్పూన్ తాజా పాల క్రీమ్

అన్నింటిని కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను పెదాలపై మూడు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి ఆ తరువాత పెదాలను చల్లటి నీటితో కడగాలి. ఈ హోం రెమెడీని రోజూ చేస్తే ఫలితం ఉంటుంది.

పసుపు, పాలు

తగినంత పసుపు పొడి, పాలు వేసి పేస్ట్ తయారుచేసుకోవాలి. తడి వేళ్లతో పెదవులపై పేస్ట్‌ను రుద్దాలి. ఐదు నిమిషాల పాటు అలానే వదిలేసి ఆ తరువాత పెదవులను కడిగేయాలి. తరువాత పెదవులకు మాయిశ్చరైజర్ అప్లై చెయ్యాలి..

ప్రపంచంలోనే మొట్టమొదటి బంగారంతో నిర్మించబడిన హోటల్ .. ఇందులో అద్దె ఎంతంటే..!

భూమిపై ఉండే 8 అతిపెద్ద చెట్లు ఇవీ..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 26 , 2024 | 04:44 PM