Share News

నల్లేరు పొడి

ABN , Publish Date - Nov 17 , 2024 | 09:56 AM

కావలసిన పదార్థాలు: లేత నల్లేరు కాడలు - ఒక కప్పు, నూనె - 3 టేబుల్‌ స్పూన్లు, నువ్వులు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు - పావు కప్పు చొప్పున. మెంతులు - పావు టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, వెల్లుల్లి - 10 రెబ్బలు, చింతపండు - చిన్న నిమ్మకాయంత, కరివేపాకు - గుప్పెడు, ఎండుమిర్చి - 15, ఉప్పు - రుచికి.

తయారుచేసే విధానం: నల్లేరు కాడల నార తీసి, కడిగి, ముక్కలుగా చేసి ఆరబెట్టాలి. కడాయిలో 2 టేబుల్‌ స్పూన్లు నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, మెంతులు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించాలి. తర్వాత ఎండుమిర్చి కలిపి అన్నీ దోరగా వేగించాలి. ఇప్పుడు నువ్వులు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, చింతపండు వేసి మరో 3 నిమిషాలు చిన్నమంటపై వేగించి, తీసి చల్లారనివ్వాలి. అదే కడాయిలో మిగిలిన నూనె వేసి నల్లేరు ముక్కల్ని వేగించాలి. అన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో ముందు పప్పుల మిశ్రమంతో పాటు ఉప్పు, వెల్లుల్లి వేసి పొడి చేయాలి. ఆ తర్వాత నల్లేరు ముక్కలు కూడా వేసి అన్నీ కలిసేలా బరకగా పొడిచేసుకోవాలి. అన్నంలో తొలి ముద్దగా నెయ్యితో పాటు ఒక స్పూను పొడి వేసుకుని తింటే కీళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉంది.

Updated Date - Nov 17 , 2024 | 09:56 AM