Share News

Viral Video: ఇలాంటి స్టంట్లు చేయాలంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూడండి..

ABN , Publish Date - Jul 09 , 2024 | 03:47 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పాపులారిటీ కోసం జనాలు ఏం చేసేందుకైనా సిద్ధపడుతున్నారు. వెరైటీగా ఏదో ఒకటి చూసి అటెన్షన్ సంపాదించుందుకు తాపత్రయపడుతున్నారు. అందుకోసం కొందరు సిగ్గు విడిచి ప్రవర్తిస్తుంటే, మరికొందరు ప్రాణాంతక సాహసాలకు తెగబడుతున్నారు.

Viral Video: ఇలాంటి స్టంట్లు చేయాలంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూడండి..
Car stunt

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పాపులారిటీ కోసం జనాలు ఏం చేసేందుకైనా సిద్ధపడుతున్నారు. వెరైటీగా ఏదో ఒకటి చేసి అటెన్షన్ సంపాదించేందుకు తాపత్రయపడుతున్నారు. అందుకోసం కొందరు సిగ్గు విడిచి ప్రవర్తిస్తుంటే, మరికొందరు ప్రాణాంతక సాహసాలకు (Dangerous Stunt) తెగబడుతున్నారు. బైక్‌లతోనూ, కార్లతోనూ సాహసాలు చేస్తున్నారు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా మన కళ్ల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే (Viral Video).


chebotarev_life అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రెండు కార్లు వేగంగా వెళ్తున్నాయి. పక్క పక్కనే వెళ్తున్న ఆ రెండు కార్లపై చెరో కాలు వేసి ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ రెండు కార్ల కంటే ముందు మరో కారు వేగంగా వెళ్తోంది. ఆ కారు మీదకు ఈ వ్యక్తి దూకి సీట్లో కూర్చున్నాడు. రెండు కార్ల మీద నుంచి దూకి మూడో కారు మీదకు వచ్చిన సమయంలో ఆ వ్యక్తి కాలు కారు డ్రైవర్ దవడకు బలంగా తగిలింది. ఎలాగైతేనేం అత్యంత ప్రమాదకర స్టంట్‌ను ఆ వ్యక్తి సురక్షితంగా పూర్తి చేయగలిగాడు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాలుగు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోను 14 లక్షల 25 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోకు దాదాపు కోటి వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది చాలా ప్రమాదరకమైన స్టంట్``, ``99 శాతం ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది``, ``గొప్ప టెక్నిక్ ఉండాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వావ్.. పామును ఎలా హిప్నటైజ్ చేస్తున్నాడో చూడండి.. పాములు పట్టే టెక్నిక్ ఇదేనన్నమాట!


Viral Video: బ్రెయిన్ వాడితే స్ట్రెయిన్ తగ్గుతుంది.. ఈ మహిళలు వాడుతున్న టెక్నిక్‌లు చూస్తే మతి పోగొట్టుకోవాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 09 , 2024 | 03:47 PM