Share News

Brain Teaser IQ Test: 5 సెకన్లే టైమ్.. సత్తా ఉంటే సమాధానం చెప్పండి..!

ABN , Publish Date - Oct 18 , 2024 | 05:53 PM

Viral News: ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది ప్రజలు పని ఒత్తిడితో చిత్తైపోతున్నారు. నిరంతరం పని గురించి, జీవితం గురించి ఆలోచిస్తూ లేనిపోని టెన్షన్‌కు గురవుతున్నారు. అందుకే ఈ ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు చాలా మంది సోషల్ మీడియాని ఉపయోగిస్తుంటారు. అందులో వచ్చే వైరల్ ఫోటోలు, వీడియోలను చూస్తూ..

Brain Teaser IQ Test: 5 సెకన్లే టైమ్.. సత్తా ఉంటే సమాధానం చెప్పండి..!
Brain Teaser IQ Test

Viral News: ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది ప్రజలు పని ఒత్తిడితో చిత్తైపోతున్నారు. నిరంతరం పని గురించి, జీవితం గురించి ఆలోచిస్తూ లేనిపోని టెన్షన్‌కు గురవుతున్నారు. అందుకే ఈ ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు చాలా మంది సోషల్ మీడియాని ఉపయోగిస్తుంటారు. అందులో వచ్చే వైరల్ ఫోటోలు, వీడియోలను చూస్తూ రిఫ్రెష్ అవుతుంటారు. ప్రధానంగా బ్రెయిన్ టీజర్, ఐక్యూ టెస్ట్‌కు సంబంధించిన ఫోటోలు వ్యక్తుల మైండ్‌ని రిఫ్రెష్ చేస్తుంటాయి. అంతేకాదు.. వారి మేధా శక్తిని పెంచుతాయి. అందుకే.. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఫోటో ఒకటి నెట్టింట రచ్చ చేస్తోంది. మాంచి లాజిక్ క్వశ్చన్‌తో వ్యక్తుల బ్రెయిన్‌ను పదునుపెట్టేలా ఉంది. జస్ట్ 5 సెకన్లలో ఆ ప్రశ్నకు సమాధానం చెబితే మీ ఐక్యూ లెవల్ పీక్స్ అని చెప్పొచ్చు. మరి ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది? ఆ ప్రశ్న ఏంటనేది ఓసారి చూద్దాం..


వాస్తవానికి ఈ ఫజిల్ గేమ్స్ మానసికంగా స్ట్రాంగ్ చేస్తాయి. ఆలోచనా శక్తిని పెంచుతాయి. విమర్శనాత్మక ఆలోచనలో నిమగ్నం చేస్తాయి. మెదడు పనితీరును సైతం మెరుగుపరుస్తుంది. అందుకే ఇలాంటి ఫోటోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఫజిల్ గేమ్‌ను మించి ఉన్న ఈ ఫోటోలో ఇద్దరు వ్యక్తులు నదిలో వేర్వేరు పడవల్లో ప్రయాణిస్తున్నారు. ఈ రెండు పడవలకు చిల్లులు పడ్డాయి. ఒక పడవకు రెండు రంద్రాలు పడగా.. మరో పడవకు ఒక రంద్రం మాత్రమే పడింది. అయితే, ఒక రంద్ర పడిన పడవ.. ఆ రంద్రాన్ని మించి నీట మునిగింది. రెండు రంద్రాలు ఉన్న పడవ.. కొంత మేరకు మునిగింది. అయితే, రెండు పడవలో ఏ పడవ ముందుగా మునిగిపోతుంది? అనేది ఇక్కడ అసలు ప్రశ్న. రెండు రంద్రాలున్న పడవ ముందుగా మునిగిపోతుందా? లేక ఒక రంద్రం ఉన్న పడవ ముందుగా మునిగిపోతుందా? కేవలం 5 సెకన్లలో ఫోటోను చూసి సమాధానం చెప్పాలి. ఇన్ టైమ్‌లో సమాధానం చెప్పిన వారి ఐక్యూ పీక్స్‌లో ఉన్నట్లు భావించొచ్చు.


సమాధానం ఇలా గుర్తించండి..

ఆ ఫోటోను నిశితంగా పరిశీలించండి.. తార్కికంగా ఆలోచించండి. మొదట ఈజీగా, కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. కానీ, రంద్రాలను చూసి మోసపోవద్దు. లాజిక్‌గా ఆలోచిస్తే సమాధానం ఇట్టే చెప్పేయొచ్చు. సమాధానం కనుగొన్నారా? అయితే, మీ ఐక్యూ సూపర్ అనమాట. ఏంటి.. ఇంకా సమాధానం దొరకలేదా? మరేం పర్వాలేదు. సమాధానం కింద ఫోటోలో ఇవ్వడం జరుగుతుంది. దాని ఆధారంగా మీరు ఆన్సర్‌ను ఐడెంటిఫై చేయొచ్చు.


ఇదిగో ఆన్సర్..

ఎవరు ముందుగా మునిగిపోతారో గుర్తించలేదా? మరేం పర్వాలేదు. ఇక్కడ సమాధానం బోట్ B ముందుగా మునిగిపోతుంది. ఈ బోట్‌కు ఒకే రంధ్రం ఉన్నప్పటికీ.. ఆ రంధ్రం గుండా పడవలో అప్పటికే భారీగా నీరు చేరింది. పడవ నీటిలోపలికి సగం మునిగింది. అంటే ఇది వేగంగా మునిగిపోవడానికి ఆస్కారం ఉంది. ఇక రెండు రంధ్రాలు ఉన్న పడవలోకి నీరు చేరలేదు. ఆ రంధ్రాల గుండా నీరు ఎక్కువగా వెళ్లడం లేదు. అందుకే.. అది మునగడానికి ఎక్కువ సమయం పడుతుంది. సో.. ఆన్సర్ వచ్చేసి B పడవ త్వరగా మునిగిపోతుంది.

Brain-Teaser-2.jpg


Also Read:

అమ్మవారి అలంకరణలో పసికూన.. వైరల్ వీడియో

మల్బరీ పండ్లు తింటున్నారా మీరు లక్కీ..

సామాన్యులకు బిగ్ షాక్.. ఇలా అయితే బంగారం కొనడం కష్టమే..

For More Trending News and Telugu News..

Updated Date - Oct 18 , 2024 | 05:53 PM