Shocking: వందల కోట్ల లాటరీ గెలిచాడు.. జీవితం మారిపోతుందనుకున్నాడు.. కొన్ని రోజులకే ఊహించని సీన్..
ABN , Publish Date - Dec 16 , 2024 | 09:51 AM
అదృష్టం కొద్దీ లాటరీ రూపంలో డబ్బు వస్తే ఓవర్ నైట్ కోటీశ్వరులు అయిపోవాలని చాలా మంది కలలు కంటుంటారు. బ్రెజిల్‌కు చెందిన ఓ రైతుకు అలాంటి అవకాశమే వచ్చింది. ఏకంగా రూ.283 కోట్ల రూపాయల లాటరీని గెలుచుకున్నాడు. ఆ డబ్బుతో తన జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాడు. కట్ చేస్తే..
ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ధన సంపాదనే ధ్యేయంగా బతుకుతుంటారు. డబ్బు (Money) సంపాదించేందుకు కష్టపడి పని చేస్తుంటారు. అదృష్టం కొద్దీ లాటరీ (Lottery) రూపంలో డబ్బు వస్తే ఓవర్ నైట్ కోటీశ్వరులు అయిపోవాలని చాలా మంది కలలు కంటుంటారు. బ్రెజిల్‌కు (Brazil) చెందిన ఓ రైతుకు అలాంటి అవకాశమే వచ్చింది. ఏకంగా రూ.283 కోట్ల రూపాయల లాటరీని గెలుచుకున్నాడు. ఆ డబ్బుతో తన జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాడు. కట్ చేస్తే.. కోరకలేవీ నెరవేర్చుకోకుండానే గుండెపోటుతో (Heart Attack) చనిపోయాడు. ఆ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (Viral News).
బ్రెజిల్‌కు చెందిన ఆంటోనియో అనే రైతుకు లాటరీ టిక్కెట్లు కొనే అలవాటు ఉంది. బ్రెజిల్‌లోనే అతిపెద్ద లాటరీ అయిన మెగాసేనలో 26.5 మిలియన్ పౌండ్ల లాటరీ విజేతగా నిలిచాడు. భారత కరెన్సీ ప్రకారం చెప్పాలంటే రూ.283 కోట్ల జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు. ఆ డబ్బుతో తన కలలు అన్నింటినీ నెరవేర్చుకోవచ్చునని, అప్పులన్నీ తీర్చేసి సంతోషంగా జీవితాన్ని గడపవచ్చునని అనుకున్నాడు. డబ్బులు చేతికి అందగానే ఎన్నాళ్లుగా చేయించుకుకోవాలనుకుంటున్న డెంటల్ సర్జరీకి డేట్ ఫిక్స్ చేసుకున్నాడు.
సర్జరీ చేయించుకునేందుకు హాస్పిటల్‌కు వెళ్లాడు. వైద్యులు సర్జరీ చేస్తుండగా గుండె పోటు వచ్చి ప్రాణాలు వదిలేశాడు. దీంతో ఆంటోనియో కుటుంబ సభ్యులు సదరు డెంటల్ క్లినిక్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆంటోనియోది సహజ మరణమా, హత్య అనేది తేల్చే పనిలో ఉన్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..
Picture Puzzle: మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనిపెట్టండి..
Viral Video: వామ్మో.. ట్రాక్టర్‌ను తోయబోయి ఎంత ప్రమాదంలో ఇరుక్కున్నాడో చూడండి.. వీడియో వైరల్..
Viral Video: చైనాలో అంతే.. భారీ బిల్డింగ్‌ల మీద నుంచి కార్లు ఎలా వెళ్లిపోతున్నాయో చూడండి..
Viral Video: సరదా తీరిపోయింది.. గుర్రం బళ్లతో రేస్.. చివరకు ఆ కుర్రాళ్ల పరిస్థితి ఏమైందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి