Viral: వధువుకు చుక్కలు చూపించిన వరుడి స్నేహితులు.. చైనాలో వింత సాంప్రదాయం.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Oct 08 , 2024 | 08:25 PM
జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి రోజు మీకు అనందానుభూతులను పంచడం కాకుండా, పీడకలగా మిగిలితే ఎలా ఉంటుంది. తాజాగా చైనాకు చెందిన ఓ వధువుకు అలాంటి అనుభవమే ఎదురైంది. శతాబ్దాల నాటి సాంప్రదాయం పేరుతో వరుడి స్నేహితులు ఆమెతో అనుచితంగా ప్రవర్తించారు.
పెళ్లి (Wedding) అనేది ఎవరి జీవితంలోనైనా అత్యంత మరపురాని ఘట్టం. ముఖ్యంగా అమ్మాయిలకు అయితే అది అత్యంత ప్రత్యేకమైన రోజు. ఆ రోజు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తారు. ఎంతగానో సిద్ధం అవుతారు. ఆమె తన పుట్టింటిని వదిలి అత్తింటికి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. అయితే అంత ముఖ్యమైన పెళ్లి రోజు మీకు అనందానుభూతులను పంచడం కాకుండా, పీడకలగా మిగిలితే ఎలా ఉంటుంది. తాజాగా చైనా (China)కు చెందిన ఓ వధువు (Bride)కు అలాంటి అనుభవమే ఎదురైంది. శతాబ్దాల నాటి సాంప్రదాయం పేరుతో వరుడి స్నేహితులు ఆమెతో అనుచితంగా ప్రవర్తించారు. చైనా సోషల్ మీడియాలో ఆ ఘటనకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది (Viral News).
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. వరుడు స్నేహితులు వివాహానికి ముందు వధువును కిడ్నాప్ చేసి తీసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న ఓ టెలిఫోన్ స్థంభానికి కట్టేశారు. ఆమె ఎంత గట్టిగా అరిచినా, కేకలు వేసినా విడిపించేందుకు ఎవరూ రాలేదు. కొద్దిసేపటి తర్వాత ఆ వధువును విడిపించి కల్యాణ మండపానికి తీసుకెళ్లారు. చైనాలో ఆ తెగలో ఇది శతాబ్దాల నుంచి వస్తున్న అచారం అట. వివాహానికి ముందు వధువును వరుడి స్నేహితులు ఇలా ఏడిపిస్తారట. తాజా ఘటనలో వధువును స్థంభానికి కట్టేసే సమయంలో వరుడు కూడా దగ్గర్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ క్రూయల్ జోక్ వధువుకు పీడకలను మిగిల్చింది. ఈ ఘటనకు సంబంధించిన చైనా సోషల్ మీడియాలో వేదికగా వైరల్ అవుతోంది.
ఈ సాంప్రదాయంపై చైనా యువతీయువకులు మండిపడుతున్నారు. ఈ వీడియోపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ``ఇతరుల బాధలో ఇలా ఆనందాన్ని వెతుక్కోవడం సిగ్గుచేటు``, ``ఈ అశ్లీల వివాహ ఆచారాలు గత కాలపు అవశేషాలు. వీటిని పాటించి ఇతరులను బాధపెట్టనక్కర్లేదు``, ``ఎంతో సంతోషంగా ఉండాల్సిన రోజున ఆ వధువు చాలా అసౌకర్యంగా ఫీలై ఉంటుంది``, ``ఇలాంటి పిచ్చి ఆచారాలను పాటించే వారు ఇంకా ఉన్నారా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..