Share News

Viral Video: పాపం.. పెళ్లి తర్వాత ఆమెతో ఎలా వేగుతాడో.. వధువు బలం ముందు చిత్తు అయిన వరుడు..

ABN , Publish Date - Dec 06 , 2024 | 07:17 PM

పెళ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ ఘటనలు, ఆసక్తికర వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు వధూవరుల ఎంట్రీకి సంబంధించిన వీడియోలు, మరికొన్ని సార్లు పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్‌లు, ఇంకొన్నిసార్లు వివాహ ఆచారాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Viral Video: పాపం.. పెళ్లి తర్వాత ఆమెతో ఎలా వేగుతాడో.. వధువు బలం ముందు చిత్తు అయిన వరుడు..
Bride funny video

ప్రస్తుతం పెళ్లిళ్ల (Weddings) సీజన్ జోరుగా సాగుతోంది. ఆయా పెళ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ ఘటనలు, ఆసక్తికర వీడియోలు (Wedding Videos) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు వధూవరుల ఎంట్రీకి సంబంధించిన వీడియోలు, మరికొన్ని సార్లు పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్‌లు, ఇంకొన్నిసార్లు వివాహ ఆచారాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో వివాహ కార్యక్రమంలో వధువు (Bride) పట్టుదల, పోరాటానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ ఫన్నీ వీడియోను చూసిన జనాలు సరదా కామెంట్లు చేస్తున్నారు (Viral Video).


deepika02100 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. వివాహ కార్యక్రమంలో భాగంగా వధూవరులు ఉంగరాన్ని వెతికే ఆచారంలో పాల్గొన్నారు. ఓ బేసిన్‌లో పాలు వేసి లోపల ఉంగరాన్ని వేశారు. వధూవరులిద్దరూ ఒకేసారి ఆ ఉంగరం కోసం పోటీ పడుతున్నారు. ఆ పోటీలో గెలవడానికి వధువు ఎంతో కృషి చేసింది. వరుడి చేతిని గట్టిగా పట్టుకుని మరో చేత్తో ఉంగరాన్ని వెతికేసింది. వరుడు తన చేతిని విడిపించుకోలేక, వధువు బలం ముందు గెలవలేక పరాజితుడిగా నిలిచాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మంది వీక్షించారు. 12 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``ఈ వ్యక్తి వైవాహిక జీవితం చాలా దయనీయంగా ఉంటుంది``, ``పాపం.. వరుడి కుటుంబం భయపడింది``, ``అమ్మాయి ఇలా ఉంటే అరేంజ్డ్ మ్యారేజీ భయంకరంగా ఉంటుంది``, ``వరుడిని తలచుకుంటే జాలి వేస్తోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వీళ్లు మామూలు కిలేడీలు కారు.. షాప్‌లో ఎలా చోరీ చేశారో చూడండి.. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే..


Viral Video: ముసలోడే కానీ, మహానుభావుడు.. పోటీలో కుర్రాడిని ఎలా బోల్తా కొట్టించాడో చూడండి..


Viral Video: వామ్మో.. కుక్కను మింగేసి కదల్లేకపోతున్న భారీ కొండ చిలువ.. షాకింగ్ వీడియో వైరల్..


Viral News: అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్, గర్ల్‌ఫ్రెండ్స్.. వియత్నాంలో ఈ కొత్త ట్రెండ్‌కు కారణం ఏంటంటే..


Viral Video: ఈ కుక్కకు ఏమైంది.. పెళ్లి మండపంలో వధువుకు చుక్కలు చూపించిన పెట్ డాగ్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 06 , 2024 | 07:17 PM