Bryan Johnson: 46 ఏళ్ల వయసులో ఎలా ఉన్నాడో చూడండి.. మీరు కూడా అలా మారడానికి ఎంత ఖర్చు పెట్టాలంటే..
ABN , Publish Date - Apr 29 , 2024 | 11:22 AM
వృద్ధాప్యాన్ని ఎవరూ ఇష్టపడరు. వయసు పెరిగిపోతున్నా యవ్వనంగా కనిపించడానికే చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇందుకోసం ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి.
వృద్ధాప్యాన్ని (Oldage) ఎవరూ ఇష్టపడరు. వయసు పెరిగిపోతున్నా యవ్వనంగా కనిపించడానికే చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇందుకోసం ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అమెరికాకు చెందిన బిలియనీర్ వ్యాపారవేత్త అయిన బ్రయాన్ జాన్సన్ (Bryan Johnson) ఈ యాంటీ-ఏజింగ్ (Anti-aging) గురించి ఎన్నో పరిశోధనలు చేయించారు. అందుకోసం రూ.16 కోట్లు ఖర్చుపెట్టారు. డ్రింక్ మిక్స్, ట్యాబ్లెట్లు, పాము నూనె, పలు ఔషధాలతో కూడిన సప్లిమెంట్స్‌ను తయారు చేశారు (Anti-aging supplement).
ఈ సప్లిమెంట్స్‌కు ``ప్రాజెక్ట్ బ్లూప్రింట్`` (Blueprint) అని పేరు పెట్టారు. వాటిన ఆయన స్వయంగా వాడి 46 ఏళ్ల వయసులో 18 ఏళ్ల కుర్రాడిలా మారిపోయారు. తన వయసును రివర్స్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ సప్లిమెంట్స్‌ను ఆయన అమ్మకానికి పెట్టారు. ఆ సప్లిమెంట్స్ ధరను రూ.28 వేలుగా నిర్ణయించారు. అయితే, వీటి పనితీరుపై మాత్రం ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే ఈ సప్లిమెంట్స్‌ను ఉపయోగించాలని చాలా మంది భావిస్తున్నారు. త్వరలోనే పలు దేశాలకు బ్రయాన్ తన ఉత్పత్తులను సప్లై చేయబోతున్నారు.
అమెరికా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, కెనడా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, యూకేతో సహా మొత్తం 23 దేశాలకు ఈ సప్లిమెంట్స్‌ను డెలివరీ చేయబోతున్నారు. తన వయసు దాదాపు 30 సంవత్సరాలు తగ్గిందని, ఈ సప్లిమెంట్స్ వల్ల ఎలాంటి సైడ్-ఎఫెక్ట్స్ ఉండవని బ్రయాన్ నమ్మకంగా చెబుతున్నారు. ఈ సప్లిమెంట్స్ కనుక సక్సెస్ అయితే చాలా మంది తిరిగి యవ్వనంలోకి అడుగుపెట్టడం ఖాయం.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఓర్నీ.. మెడలో దండ ఎవరైనా ఇలా వేస్తారా? వధువు మీదకు దూకిన వరుడు.. ఫన్నీ వీడియో వైరల్!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం క్లిక్ చేయండి..