Viral Video: తల్లిని కాపాడుకునేందుకు ఏనుగుతో తలపడేందుకు సిద్ధమైన గేదె పిల్ల.. ఏం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Jun 19 , 2024 | 03:52 PM
తన బిడ్డను కాపాడుకునేందుకు తల్లి ఎంత దూరమైనా వెళ్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి శత్రువుతో పోరాడుతుంది. మనుషుల్లో అయినా జంతువుల్లో అయినా తల్లి తన బిడ్డకు రక్షణగా నిలుస్తుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ బిడ్డ తన తల్లికి రక్షణగా నిలిచింది.
తన బిడ్డను కాపాడుకునేందుకు తల్లి (Mother) ఎంత దూరమైనా వెళ్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి శత్రువుతో పోరాడుతుంది. మనుషుల్లో అయినా జంతువుల్లో అయినా తల్లి తన బిడ్డకు రక్షణగా నిలుస్తుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video)లో ఓ బిడ్డ తన తల్లికి రక్షణగా నిలిచింది. తన తల్లిని కాపాడుకునేందుకు ఎంతో బలమైన శత్రువుతో పోరాటానికి దిగింది. ఆ బిడ్డ తెగువకు ముచ్చటపడిన ఏనుగు (Elephant) అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఏనుగు ఓ గేదె (Buffalo) ఎదురెదురుగా ఉన్నాయి. అంతలో గేదె పిల్ల (Buffalo calf) ఏనుగు వైపు పరుగెత్తడం ప్రారంభించింది. దీంతో ఆ ఏనుగు వెనక్కి పరిగెత్తింది. గేదె పిల్ల తరుముతున్న కొద్దీ ఏనుగు వెనక్కి పరిగెత్తింది. తన పిల్లను ఆపేందుకు గేదె కూడా పరిగెత్తింది. చివరకు ఏనుగు అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయింది. గేదె తన పిల్లతో కలిసి వేరే దిక్కుకు వెళ్లిపోయింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 6.5 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. దాదాపు 6 వేల మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఏనుగు అనవసరంగా దాడికి దిగదు``, ``ఆ గేదె పిల్ల తెగువ ఏనుగుకు చాలా నచ్చింది``, ``ఆ ఏనుగు ప్రవర్తన చాలా నచ్చింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
MS Dhoni: ``తలా ఫర్ ఏ రీజన్``.. రొనాల్డోకు ధోనీతో పోలిక.. ఆసక్తికర ట్వీట్ చేసిన ఫిఫా!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..