Share News

Viral Video: ఆహా.. ఏం తెలివి బాసూ.. కారు వైపర్స్ పని చేయకపోవడంతో ఏం చేశాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , Publish Date - Mar 11 , 2024 | 07:59 PM

మన దేశంలో కొందరు వ్యక్తులు పెద్ద పెద్ద సమస్యలకు కూడా సులభమైన పరిష్కారాలు కనుగొంటూ ఉంటారు. అవసరానికి అనుగుణంగా ఏదో ప్లాన్ వేసి సమస్య నుంచి బయటపడుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవక తప్పదు.

Viral Video: ఆహా.. ఏం తెలివి బాసూ.. కారు వైపర్స్ పని చేయకపోవడంతో ఏం చేశాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

మన దేశంలో కొందరు వ్యక్తులు పెద్ద పెద్ద సమస్యలకు కూడా సులభమైన పరిష్కారాలు కనుగొంటూ ఉంటారు. అవసరానికి అనుగుణంగా ఏదో ప్లాన్ వేసి సమస్య నుంచి బయటపడుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Jugaad Videos) చూస్తే షాక్ అవక తప్పదు. వర్షంలో (Rain) వెళ్తున్న కారు వైపర్స్ (Car wipers) పాడైపోతే.. దానికి ఆ దంపతులు కనుగొన్న పరిష్కారం ఏంటో చూస్తే వారి తెలివికి ఫిదా కావాల్సిందే. ఆ వీడియో (Viral Video) సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

pubity అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో భార్యాభర్తలు కారులో ఎక్కడికో వెళ్తున్నారు. వర్షం పడుతుండగా కారు వైపర్స్ చెడిపోయాయి. వర్షంలో కారు వైపర్స్ లేకుండా ప్రయాణించడం ఎంత ప్రమాదకరమో తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో ఆ జంట అద్భుతమైన ప్లాన్ వేసింది. కారులో కూర్చున్న మహిళ రెండు వైపర్‌లకు రెండు పొడవాటి తాళ్లను కట్టి తన చేతులతో లాగుతోంది. దీంతో వైపర్లు అటూ ఇటూ కదులుతూ కారు అద్దాన్ని శుభ్రం చేస్తున్నాయి.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 1.6 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``వైపర్లు బాగు చేయించడానికి బదులు భార్యను కారులో ఇన్‌స్టాల్ చేశాడు``, ``అలాంటి భార్య ఉంటే ఎంత అదృష్టమో``, ``వారిని పొగడడానికి మాటలు చాలడం లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 11 , 2024 | 07:59 PM