Share News

Castor oil: జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే.. ఆముదాన్ని ఇలా వాడి చూడండి..!

ABN , Publish Date - Aug 07 , 2024 | 03:29 PM

జుట్టుకు చాలా రకాల నూనెలు ఉపయోగిస్తుంటారు. అలాంటి వాటిలో ఆముదం కూడా ఒకటి. చిక్కగా, బంగారు రంగులో ఉండే ఆముదం వాడితే జుట్టు పెరుగుదల అద్భుతంగా ఉంటుందని కొందరు అంటారు. అయితే..

Castor oil: జుట్టు ఒత్తుగా,  పొడవుగా పెరగాలంటే.. ఆముదాన్ని ఇలా వాడి చూడండి..!
castor oil

జుట్టు సంరక్షణలో నూనెలు ఉపయోగించడం కూడా ఒక పద్దతి. నూనెతో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల తలలో రక్తప్రసరణ మెరుగయ్యి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టుకు చాలా రకాల నూనెలు ఉపయోగిస్తుంటారు. అలాంటి వాటిలో ఆముదం కూడా ఒకటి. చిక్కగా, బంగారు రంగులో ఉండే ఆముదం వాడితే జుట్టు పెరుగుదల అద్భుతంగా ఉంటుందని కొందరు అంటారు. అయితే జుట్టు పెరుగుదల మెరుగ్గా ఉండటానికి ఆముదాన్ని ఎలా వాడాలి? తెలుసుకుంటే..

bald in men: మగవాళ్లలోనే బట్టతల రావడానికి కారణం ఏంటి? వైద్యులు చెప్పిన నిజాలు ఇవీ..!



  • ఆముదంతో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల తలలో రక్తప్రసరణ మెరుగవుతుంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటాన్ని నివారిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా, మందంగా పెరగడంలో సహాయపడుతుంది.

  • 2టీస్పూన్ల ఆముదంలో 2 టీ స్పూన్ల కొబ్బరినూనెను మిక్స్ చేయాలి. ఈ నూనెను జుట్టు కుదుళ్లకు పట్టేలా బాగా మసాజ్ చేయాలి. సుమారు గంట నుండి 2 గంటల పాటూ దీన్ని అలాగే వదిలేయాలి. తరువాత తల స్నానం చేయాలి. లేదంటే రాత్రి ఈ నూనెను అప్లై చేసి ఉదయాన్నే తలస్నానం చేయవచ్చు. ఇలా చేస్తే జుట్టు పెరుగుదల అద్భుతంగా ఉంటుంది.

  • ఆముదాన్ని ఒక కప్పులో తీసుకోవాలి. దీన్ని వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ నూనెతో జుట్టు కుదుళ్లకు బాగా ఇంకేలా మసాజ్ చేయాలి. ఒక అరగంట వరకు దీన్ని అలాగే ఉండనివ్వాలి. ఆ తరువాత తల స్నానం చెయ్యాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెంచితే నష్టాలు తప్పవు..!


  • 1టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, విటమిన్-ఇ ఆయిల్ రెండింటిని 1 టేబుల్ స్పూన్ ఆముదంలో మిక్స్ చేయాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు అప్లై చేయాలి. గంట ఆగి తల స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే జుట్టు బాగా పెరుగుతుంది.

  • జుట్టు బాగా రాలిపోతుంటే దానికి ఆముదం చక్కని పరిష్కారంగా పనిచేస్తుంది. ఆముదంలో ఒకటిన్నస్పూన్ అల్లం రసం కలపాలి. దీన్ని బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. 20- 30 నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత తల స్నానం చెయ్యాలి. ఇది జుట్టు రాలడాన్ని ఆపడమే కాకుండా జుట్టు పెరగడానికి కూడా సహాయపడుతుంది.

  • జుట్టు పెరుగుదల కోసం ఆముదాన్ని రెగ్యులర్ గా ఉపయోగించవచ్చు. ఆముదాన్ని సాధారణ నూనెలు అయిన కొబ్బరినూనె, బాదం నూనె మొదలైనవాటితో మిక్స్ చేసి వాడవచ్చు. ఒక వంతు ఆముదం, మూడు వంతుల ఇతర నూనెలు తీసుకుని వాడాలి. ఇది కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు నల్లగా, ఒత్తుగా పెరగడంలో సహాయపడుతుంది.

నెయ్యితో మసాజ్ చేస్తే యవ్వనంగా మారతారా? ఆయుర్వేదం చెప్పిన నిజాలివీ..!

ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో గ్యాడ్జెట్లు సేఫ్..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 07 , 2024 | 03:29 PM