Viral News: పిల్లికి ``డాక్టర్ ఆఫ్ లిటరేచర్`` అవార్డు.. దాని వెనుకున్న ఆసక్తికర కారణం ఏంటంటే..
ABN , Publish Date - May 20 , 2024 | 12:54 PM
అత్యంత గౌరవనీయమైన `డాక్టరేట్`` సాధించడం అంత సులభం కాదు. ఎంతో కష్టపడి చదివితేనే గానీ అది సాధ్యం కాదు. లేదా ఏదైనా రంగంలో అద్భుతమైన కృషి చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. సామాన్యులకు ``డాక్టరేట్`` అనేది దక్కేది కాదు. అయితే ఓ పిల్లి తాజాగా గౌరవ డాక్టరేట్ అందుకుంది.
అత్యంత గౌరవనీయమైన డాక్టరేట్
` (Doctorate) సాధించడం అంత సులభం కాదు. ఎంతో కష్టపడి చదివితేనే గానీ అది సాధ్యం కాదు. లేదా ఏదైనా రంగంలో అద్భుతమైన కృషి చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. సామాన్యులకు ``డాక్టరేట్`` అనేది దక్కేది కాదు. అయితే ఓ పిల్లి (Cat) తాజాగా గౌరవ డాక్టరేట్ అందుకుంది. అమెరికాలోని వేర్మొంట్ స్టేట్ యూనివర్సిటీ.. మాక్స్ డౌ అనే పిల్లికి గౌరవ ``డాక్టర్ ఆఫ్ లిటరేచర్`` (Doctor of Literature) అనే బిరుదును ఇచ్చి సత్కరించింది. అంత ప్రఖ్యాత బిరుదును ఓ పిల్లికి ఎలా ఇస్తారనే అనుమానం వచ్చిందా? దాని వెనుక ఓ కారణముంది (Viral News).
వెర్మొంట్ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద తన యజమానితో కలిసి మ్యాక్స్ డౌ అనే పిల్లి చాలా సంవత్సరాలుగా నివసిస్తోంది. ఈ పిల్లి చాలా స్నేహపూర్వకంగా, మర్యాదగా ప్రవర్తిస్తుందట. ఆ గేట్ గుండా వచ్చి పోయే వారితో సన్నిహితంగా మెలుగుతుందట. ఎన్నో సంవత్సరాలుగా ఆ యూనివర్సిటీ క్యాంపస్‌లో, తరగతి గదుల్లో, లైబ్రరీలో, క్యాంటిన్‌లో ఆ పిల్లి తిరుగుతోందట. కానీ, ఒక్కసారి కూడా ఆ పిల్లి వల్ల చిన్న ఇబ్బంది కూడా కలుగలేదట. యూనివర్సిటీలో విద్యార్థులు, లెక్చరర్లలోత స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వారి ప్రేమను పొందిందట.
ఆ పిల్లి ప్రవర్తనను గుర్తించిన యూనివర్సిటీ యాజమాన్యం దానిని సత్కరించాలని నిర్ణయించుకుంది. దానికి ``డాక్టర్ ఆఫ్ లిటరేచర్`` అందించాలని నిర్ణయించుకుంది. వెంటనే డాక్టరేట్ సర్టిఫికెట్ అందించింది. ఇకపై మ్యాక్స్ డౌ కాస్తా డా.. మ్యాక్స్ డౌ అవుతుంది. తన పెంపుడు పిల్లికి అంత ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల దాని యజమాని షేల్ డౌ సంతోషం వ్యక్తం చేశాడు. క్యాంపస్‌లో అందరికీ మ్యాక్స్ తెలుసని, అందరూ దాని ప్రవర్తనను ఇష్టపడతారని షేల్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..