Share News

Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్ నుంచి గాలి వేడిగా వస్తోందా? మీరు చేస్తున్న మిస్టేక్ ఇదే..!

ABN , Publish Date - Jun 28 , 2024 | 02:05 PM

ప్రతి ఇంట్లోనూ సీలింగ్ ఫ్యాన్ పగలు, రాత్రి పనిచేస్తూనే ఉంటుంది. అయితే కొన్ని ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్ నుండి చల్ల గాలికి బదులు వేడి గాలి వస్తుంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందో అని చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు.

Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్ నుంచి గాలి వేడిగా వస్తోందా? మీరు చేస్తున్న మిస్టేక్ ఇదే..!

ఇప్పట్లో సీలింగ్ ఫ్యాన్ లేని ఇల్లు ఉండటం లేదు. ఏసీ, కూలర్ కొనే స్థోమత లేనివారు సీలింగ్ ఫ్యాన్ తో సరిపెట్టుకుంటూ ఉంటారు. ప్రతి ఇంట్లోనూ సీలింగ్ ఫ్యాన్ పగలు, రాత్రి పనిచేస్తూనే ఉంటుంది. అయితే కొన్ని ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్ నుండి చల్ల గాలికి బదులు వేడి గాలి వస్తుంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందో అని చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. ఫ్యాన్ వినియోగించే విషయంలో అవగాహన లేకపోడమే దీనికి కారణమట. చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటో తెలుసుకుంటే..

Yoga: 30రోజులు.. ఈ రెండు యోగాసనాలు వేసి చూడండి.. మీ ఫిట్‌నెస్ ఎంత మెరుగవుతుందంటే..!



చాలామంది సీలింగ్ ఫ్యాన్ ను పగలు రాత్రి ఉపయోగిస్తూనే ఉంటారు. ఇలా ఎప్పుడూ ఫ్యాన్ వినియోగించడం సరైనది కాదట. ఏసీ, కూలర్ తో పోలిస్తే సీలింగ్ ఫ్యాన్ కు విద్యుత్ వినియోగం తక్కువే అయినా దీన్ని నిరంతరం వాడకూడదట. ఇలా ఫ్యాన్ ను నిరంతరం వాడటం వల్ల ఫ్యాన్ వేడెక్కుతుంది. ఫ్యాన్ గాలి కూడా వేడిగా మారుతుంది.

ఫ్యాన్ పనిచేసేటప్పుడు ఫ్యాన్ మోటార్ విద్యుత్ వినియోగించుకోవడం వల్ల ఫ్యాన్ వేడెక్కుతుంది. ఫ్యాన్ కంటిన్యూగా రన్ అవుతూ ఉంటే ఫ్యాన్ బ్యారింగ్ ను కాల్చేస్తుంది. అందుకే ఫ్యాన్ కు మధ్య మధ్యలో రెస్ట్ ఇస్తుండాలి. ప్రతి 6 గంటలకు ఒకసారి ఫ్యాన్ కు విశ్రాంతి ఇవ్వాలి.

Curd: వర్షాకాలంలో పెరుగు తినేవారికి అలెర్ట్.. ఈ నిజాలు తెలుసుకోకుంటే నష్టపోతారు..!


Back Pain: వెన్నునొప్పి వేధిస్తోందా? ఈ 7 టిప్స్ తో చెక్ పెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 28 , 2024 | 02:05 PM