Share News

Viral News: ఐస్‌క్రీమ్‌లో జెర్రి.. హడలెత్తిన కస్టమర్

ABN , Publish Date - Jun 16 , 2024 | 12:31 PM

ఆన్ లైన్‌లో ఆర్డర్ చేసే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమరుపాటుగా ఉంటే అంతే సంగతులు. కొందరికి విచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. దీంతో ఆర్డర్ చేసిన ప్యాక్ తెరచి చూడాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. నోయిడాలో ఓ కస్టమర్ ఆన్ లైన్‌లో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశారు.

Viral News: ఐస్‌క్రీమ్‌లో జెర్రి.. హడలెత్తిన కస్టమర్
Centipede At Ice Cream Box

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఏమరుపాటుగా ఉంటే అంతే సంగతులు. కొందరికి విచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. దీంతో ఆర్డర్ చేసిన ప్యాక్ తెరచి చూడాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ కస్టమర్ ఆన్‌లైన్‌లో ఐస్ క్రీమ్ (Ice Cream) ఆర్డర్ చేశారు. బాక్స్ తెరచి చూసి ఖంగుతినడం ఆమె వంతయిపోయింది.


ఏం జరిగింది..?

నోయిడాలో దీప అనే మహిళ ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేశారు. బ్లింకిట్ యాప్ ద్వారా ఆమూల్ కంపెనీకి చెందిన ఐస్‌క్రీమ్ బుక్ చేశారు. ఐస్‌క్రీమ్ రాగానే ఎంతో ఉత్సాహంతో తెరిచి చూశారు. ఆ వెంటనే షాకవడం ఆమె వంతయిపోయింది. ఎందుకంటే అందులో జెర్రి కనిపించింది. బాబోయ్.. జెర్రి అని ఆశ్చర్య పోయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంకేముంది వీడియో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు జోరుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆమూల్ ప్రొడక్ట్స్ దేశంలో అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయి. ఆర్డర్ చేసిన తర్వాత తెరచి చూసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

Viral video: బాబోయ్..! టీని ఇలాక్కూడా చేస్తారా.. ఇది టీ కాదు విషం అంటున్న నెటిజన్లు..

Viral video: వాషింగ్‌మెషిన్‌ వద్ద మీరూ ఇలాగే చేస్తున్నారా.. ఈ వ్యక్తికి ఏం జరిగిందో చూడండి..



Updated Date - Jun 16 , 2024 | 01:20 PM