Chennai: ఓనర్ అంటే ఇలా ఉండాలి.. ఉద్యోగులకు గిఫ్టుగా 50 కార్లు
ABN , Publish Date - Jan 04 , 2024 | 03:44 PM
చెన్నైకి చెందిన ఓ కంపెనీ ఓనర్ సంస్థ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ ప్రకటించారు. 50 మంది ఉద్యోగులకు ఏకంగా 50 కార్లు బహుమతిగా ఇచ్చారు. మీరు విన్నది నిజమే. మురళి అనే బిజినెస్ మ్యాన్ తన భార్యతో కలిసి 2009లో ఐడియాస్ 2 ఐటీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు.
చెన్నై: సాధారణంగా ఏ కంపెనీ అయినా తమ సంస్థ ఉద్యోగులకు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కానుకలు ఇస్తుంటాయి. అందులో ఓ స్మార్ట్ వాచ్చో, గిఫ్ట్ ప్యాకో ఉంటాయి. మరికొన్ని కంపెనీలు ఇంకోఅడుగు ముందుకేసి స్మార్ట్ టీవీలు తదితర ఖరీదైన బహుమతుల్ని ఇస్తుంటాయి. అయితే చెన్నైకి చెందిన ఓ కంపెనీ ఓనర్ సంస్థ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ ప్రకటించారు. 50 మంది ఉద్యోగులకు ఏకంగా 50 కార్లు బహుమతిగా ఇచ్చారు.
మీరు విన్నది నిజమే. మురళి అనే బిజినెస్ మ్యాన్ తన భార్యతో కలిసి 2009లో ఐడియాస్ 2 ఐటీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. అప్పటి నుంచి కంపెనీ ఎదుగుదలలో ఉద్యోగులు కీలకంగా ఉన్నారు. నూతన సంవత్సర కానుకగా సంస్థలో ఉన్న 50 మంది శాశ్వత ఉద్యోగులకు ఏదైనా మంచి కానుక ఇవ్వాలని అనుకున్నారు. వారి కోసం 50 కార్లను బహుమతిగా అందజేశారు.
షాక్ కి గురైన ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారు సంస్థ అధినేతకు ధన్యవాదాలు తెలిపారు. కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఉద్యోగులు కంపెనీకి అండగా నిలబడ్డారని వారిని ఏదో రకంగా ఆదుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
గతేడాది కూడా 100 కార్లను బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యోగులకు కనీసం టీ కూడా ఇవ్వని సంస్థలున్న ఈ రోజుల్లో సంస్థ కోసం కృషి చేసే వారిని గుర్తుంచుకుని వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.