Share News

Viral Video: వార్నీ.. ఈ బాలుడికి ధైర్యం ఎక్కువే.. పులితో ఎలా ఆడుతున్నాడో చూడండి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Sep 06 , 2024 | 03:49 PM

పెద్ద పులిని చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవాల్సిందే. భారీ శరీరంతో చాలా క్రూరంగా కనిపించే పులి బంధించి ఉన్నా చూడడానికి కాస్త భయమేస్తుంది. అలాంటిది ఓ కుర్రాడు ఓ పులితో చక్కగా ఆడుకున్నాడు. ఆ పులి కూడా ఆ కుర్రాడిని ఇష్టపడింది. ఆ బాలుడితో స్నేహం పెంచుకుని సరదాగా ఆడుకుంది.

Viral Video: వార్నీ.. ఈ బాలుడికి ధైర్యం ఎక్కువే.. పులితో ఎలా ఆడుతున్నాడో చూడండి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Tiger is playing with a boy

పెద్ద పులిని (Tiger) చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవాల్సిందే. భారీ శరీరంతో చాలా క్రూరంగా కనిపించే పులి బంధించి ఉన్నా చూడడానికి కాస్త భయమేస్తుంది. అలాంటిది ఓ కుర్రాడు (Boy) ఓ పులితో చక్కగా ఆడుకున్నాడు. ఆ పులి కూడా ఆ కుర్రాడిని ఇష్టపడింది. ఆ బాలుడితో స్నేహం పెంచుకుని సరదాగా ఆడుకుంది. ఆ ఇద్దరికీ మధ్యలో ఓ అద్దం ఉంది. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. @EcoVibeExplorer అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో తీశారు (Viral Video).


తూర్పు చైనా (China)లోని ఒక జంతుప్రదర్శనశాలలో (Zoo) ఈ వీడియోను చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పులి తన ఎన్‌క్లోజర్‌లో ఉంది. అక్కడకు ఓ బాలుడు వెళ్లాడు. భయం లేకుండా ఆ పులితో ఆడుకున్నాడు. ఆ పులి కూడా ఆ కుర్రాడితో సరదాగా ఆడింది. ఆ కుర్రాడు. చేతులతో పంచ్‌లు ఇస్తుంటే, ప్రతిగా ఆ పులి కూడా పంచ్‌లు ఇచ్చింది. ఇద్దరూ అలా సరదాగా కొద్ది సేపు ఆడుకున్నారు. ఆ క్యూట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోకు భారీగా వ్యూస్ వచ్చాయి.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.2 కోట్ల మందికి పైగా వీక్షించారు. లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``ఇది చూడటానికి చాలా అందంగా ఉంది``, ``నిజానికి పులి కూడా పిల్లిలాంటిదే``, ``ఆ కుర్రాడితో పులి కూడా సరదాగా ఆడుతోంది``, ``ఆ పులికి మంచి ఆటవిడుపు``, ``చిన్న పిల్లలను క్రూర జంతువులు కూడా ఇష్టపడతాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూాడా చదవండి..

Picture Puzzle: మీ పరిశీలనా శక్తికి సవాల్.. ఈ సర్కస్ సీన్లో పంది పిల్ల ఎక్కడుందో 10 సెకెన్లలో కనుక్కోండి...


Viral Video: అందమే కాదు.. ధైర్యం కూడా ఈమె సొత్తే.. భారీ సర్పాన్ని పట్టుకుని ఈమె ఏం చేసిందో చూడండి..


Viral Video: ఈ మ్యాచ్‌ను దేవుడు కూడా ఎంజాయ్ చేస్తాడట.. కామెంటరీ వింటే షాక్‌తో నోరెళ్లబెట్టాల్సిందే..


Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. వరద నీటిలో మొసళ్ల బీభత్సం.. ఇది వడోదరలో చిత్రీకరించిందేనా?


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 06 , 2024 | 03:49 PM