Share News

Viral Video: వామ్మో.. పాము అక్కడకు ఎలా వెళ్లింది.. క్లాస్ రూమ్‌లో పాఠాలు చెబుతున్న టీచర్ ప్యాంట్‌లో పాము..

ABN , Publish Date - Oct 11 , 2024 | 05:28 PM

వర్షాకాలం వచ్చిందంటే పాములు వాటి స్థావరాల నుంచి జనావాసాల వైపు వచ్చేస్తుంటాయి. ఇళ్లలోకి దూరి మూల మూలన దాక్కుంటాయి. అలాంటి ఎన్నో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో అత్యంత భయంకరంగా ఉంది.

Viral Video: వామ్మో.. పాము అక్కడకు ఎలా వెళ్లింది.. క్లాస్ రూమ్‌లో పాఠాలు చెబుతున్న టీచర్ ప్యాంట్‌లో పాము..
cobra came out of the teacher's pants

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే (Snakes) భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. వర్షకాలం వచ్చిందంటే పాములు వాటి స్థావరాల నుంచి జనావాసాల వైపు వచ్చేస్తుంటాయి. ఇళ్లలోకి దూరి మూల మూలన దాక్కుంటాయి. అలాంటి ఎన్నో వీడియోలు (Snake Videos) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో అత్యంత భయంకరంగా ఉంది. క్లాస్‌రూమ్‌లో పిల్లలకు పాఠాలు బోధిస్తున్న టీచర్ (Teacher) ప్యాంట్‌లో ఓ నాగు పాము (Cobra) ఉంది. దానిని బయటకు తీయడం నిపుణుడికి కూడా సవాలుగా మారింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


indypersian అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. థాయ్‌లాండ్‌ (Thailand)లోని ఒక పాఠశాలలో విద్యార్థులకు టీచర్ పాఠం చెబుతున్న సమయంలో అతడి ప్యాంట్‌లో నుంచి అకస్మాత్తుగా ప్రమాదకరమైన నాగుపాము బయటకు వచ్చింది. ఈ దృశ్యం అక్కడున్న విద్యార్థులను షాక్‌కి గురిచేసింది. ఆ పామును బయటకు తీయడం పాములు పట్టే నిపుణుడికి కూడా సవాలుగా మారింది. అసలు ఆ ప్యాంట్‌లోకి నాగుపాము ఎలా దూరందనే ప్రశ్న చాలా మందికి కలుగుతోంది. అంతసేపు లోపలే ఉన్న నాగుపాము కాటు మాత్రం వేయలేదు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 1.42 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఈ వీడియోపై నాకు వంద ప్రశ్నలు ఉన్నాయి. అసలు పాము ఎలా లోపలికి వెళ్లింది. అంత సేపు కాటు వేయకుండా ఎందుకు ఉంది``, ``వామ్మో.. భయంకర అనుభవం``, ``ఆ టీచర్ చాలా భయంలో ఉన్నాడు``, ``ఇది డెమో కార్యక్రమం అనుకుంటా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోలో దాక్కున్న కుక్కను 10 సెకెన్లలో పట్టుకోండి..


Ratan Tata: రతన్ టాటా‌ సమస్య ఏంటి? కీలక అవయవాలను డ్యామేజ్ చేసిన ఆ వ్యాధి లక్షణాలేంటి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 11 , 2024 | 05:28 PM