ViralVideo: వాలెంటైన్స్ డే నాడు కూతురు అలా కనిపించేసరికి తట్టుకోలేక.. షాకింగ్ వీడియో వైరల్
ABN , Publish Date - Feb 15 , 2024 | 03:04 PM
వాలంటైన్స్ డే రోజున కూతుర్ని ప్రేమికుడితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఓ తల్లి వారికి పట్టపగలే చుక్కలు చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: తెలిసీతెలియని దూకుడుతనంతో యువతీయువకులు ప్రేమల్లో పడి జీవితాల్ని నాశనం చేసుకుంటారనేది తల్లిదండ్రుల భయం. వయసు తెచ్చే రాకెట్ స్పీడుతో దూసుకెళ్లిపోవడం యువత నైజం. దీంతో, కుటుంబాల్లో్ తరచూ షాకింగ్ సన్నివేశాలు ఆవిష్కృతమవుతుంటాయి. ప్రేమికుల రోజున ఇలాంటి వివాదాలు ఊహించని మలుపు తీసుకుంటాయి. ఇందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా (ViralVideo) మారింది.
ViralVideo: భారత్ పరువు ఎందుకు తీస్తున్నావ్?..లండన్‌లో యువతి చేసిన పనికి తిట్టిపోస్తున్న నెటిజన్లు!
వీడియోలో కనిపించినదాని ప్రకారం, ఓ యువతి తన ప్రియుడితో కలిసి తల్లికి తెలీకుండా రెస్టారెంట్‌కు వెళ్లింది. కానీ, తల్లికి ఈ మీటింగ్ గురించి ఎలా తెలిసిందో తెలీదు కానీ సడెన్‌గా రెస్టారెంట్లో ఆమె ఎంట్రీ ఇచ్చింది. అంతే, కూతుర్ని అలా చూసేసరికి తల్లి కోపం పీక్స్ వెళ్లిపోయింది. బరితెగించేశావంటూ చెప్పు తీసుకుని ఓ రేంజ్‌లో కొట్టేసింది. తొలుత యువతి ఫ్రెండ్‌పై రెండు దెబ్బలు వేసిన తల్లిని అడ్డుకోబోయిన యువతిపై ఆమె రెచ్చిపోయింది. ఉగ్రకాళిలా చెప్పుతో ఆ చెంపా ఈ చెంపా చెడామడా వాయించేసింది. రెస్టారెంట్లో ఉన్న ఇతర కష్టమర్లు ఎవరూ యువతి తల్లిని ఆపే సాహసం చేయకపోవడంతో ఆ యువ జంటకు పబ్లిక్‌లో చుక్కలు కనిపించాయి (Couple gets caught by girls mother brutally thrashed with slipper).
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ వాలెంటైన్స్ డే సందర్భంగా నెట్టింట హల్‌చల్ చేస్తూ యువతీయువకులకు షేక్ చేసేస్తోంది. యువతి తల్లి తీరు అనేక మందికి నచ్చకపోవడంతో వారు ఆమెను తెగ తిట్టిపోశారు. వాళ్లు ఇద్దరు 18 ఏళ్లకు పైబడిన వారి లాగే ఉన్నారు. వాళ్ల మానాన వాళ్లను వదిలేయకుండా ఈ టార్చర్ ఏంటో అంటూ మండిపడ్డారు. పబ్లిక్‌లో అలా అవమానపరచడం ఏమాత్రం సబబుగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేమికుల రోజున యువత మనసులను గాయపరిచిన ఈ వీడియో ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి