Share News

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. బురదలో కలిసిపోయిన మొసలి ఎలా ఎటాక్ చేసిందో చూడండి..!

ABN , Publish Date - May 13 , 2024 | 05:28 PM

నీటిలో ఉన్న మొసళ్లకు బలం ఎక్కువ. నీటిలోకి దిగిన ఏ జంతువైనా మొసలి కంట పడిందో అది ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. నీటి అడుగు నుంచి ప్రయాణించే మొసలి నోటికి చిక్కితే దానికి ఆహారం అయిపోవాల్సిందే. అయితే ఒడ్డు మీదకు వస్తే మొసలి బలం బాగా క్షీణిస్తుంది.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. బురదలో కలిసిపోయిన మొసలి ఎలా ఎటాక్ చేసిందో చూడండి..!
Crocodiles Attack

నీటిలో ఉన్న మొసళ్లకు (Crocodiles) బలం ఎక్కువ. నీటిలోకి దిగిన ఏ జంతువైనా మొసలి కంట పడిందో అది ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. నీటి అడుగు నుంచి ప్రయాణించే మొసలి నోటికి చిక్కితే దానికి ఆహారం అయిపోవాల్సిందే. అయితే ఒడ్డు మీదకు వస్తే మొసలి బలం బాగా క్షీణిస్తుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలోని మొసలి ఒడ్డు మీదున్న వ్యక్తిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది (Crocodiles Attack). ఆ వీడియో చూడాడానికి చాలా షాకింగ్‌గా ఉంది (Viral Video).


jayprehistoricpets అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ జూలో పూర్తిగా బురదతో నిండిపోయిన మడుగులో ఓ మొసలి ఒడ్డున ఉండి సేదతీరుతోంది. ఆ మొసలి పూర్తిగా బురదలో కలిసి పోయి ఉంది. ఆ మొసలిని చూసిన ఓ సందర్శకుడు దానిని కెమేరాలో బంధించేందుకు ప్రయత్నించాడు. కాసేపు సైలెంట్‌గా ఉన్న మొసలి మడుగు నుంచి ఒడ్డుపైకి దూకి ఆ సందర్శకుడిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. దీంతో కేకలు వేస్తూ అందరూ పారిపోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 1.5 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఒడ్డు మీద కూడా మొసళ్లు దాడి చేయగలవు``, ``మొసలి సహనాన్ని పరీక్షిస్తే అలాగే ఉంటుంది``, ``చాలా మంది అమెరికన్లు తెలివి తక్కువగా ప్రవర్తించి మొసళ్ల దాడులకు గురవుతుంటారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ వ్యక్తి తెలివి తేటలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. కారులో చెరుకు రసం మెషిన్ ఎలా సెట్ చేశాడో చూడండి..


Puzzle: మీ సామర్థ్యానికి పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు ముఖ్యమైన తేడాలను కనిపెట్టండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 13 , 2024 | 05:29 PM