Share News

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. వరద నీటిలో మొసళ్ల బీభత్సం.. ఇది వడోదరలో చిత్రీకరించిందేనా?

ABN , Publish Date - Sep 03 , 2024 | 01:51 PM

భారీ వర్షాల కారణంగా నదులు, కాలువలు, సరస్సులు పొంగి ప్రవహిస్తున్నాయి. జనజీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. నీటితో నిండిపోయిన ఇళ్లలో, కాలనీల్లో జీవనం సాగించడమే నరకం అంటే.. ఆ నీటి ద్వారా కొట్టుకు వస్తున్న మొసళ్ల నుంచి ప్రాణాలు దక్కించుకోవడం మరింత పెద్ద టాస్క్‌లా మారిపోయింది.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. వరద నీటిలో మొసళ్ల బీభత్సం.. ఇది వడోదరలో చిత్రీకరించిందేనా?
crocodile was seen killing cattle in the Vishwamitri river

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు (Rains) కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు (Floods) ముంచెత్తుతున్నాయి. నదులు, కాలువలు, సరస్సులు పొంగి ప్రవహిస్తున్నాయి. జనజీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. నీటితో నిండిపోయిన ఇళ్లలో, కాలనీల్లో జీవనం సాగించడమే నరకం అంటే.. ఆ నీటి ద్వారా కొట్టుకు వస్తున్న మొసళ్ల (Crocodiles) నుంచి ప్రాణాలు దక్కించుకోవడం మరింత పెద్ద టాస్క్‌లా మారిపోయింది. ముఖ్యంగా ఉత్తరాదిన ఈ మొసళ్ల బాధ ఎక్కువగా కనబడుతోంది. తాజాగా గుజరాత్‌లోని వడోదరలో కనిపించిన ఓ దృశ్యం చూస్తే గూస్‌బంప్స్ రావడం ఖాయం (Viral Video).


గుజరాత్‌ (Gujarat Floods)లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చాయి. తాజాగా వడోదర (Vadodara)లో ఓ భయానక దృశ్యం వెలుగులోకి వచ్చింది. వరద నీటితో పాటు విశ్వామిత్ర నదిలోని మొసళ్లు నివాస ప్రాంతాలకు చేరుతున్నాయి. అవి తమకు అందిన జంతువులను చంపి లాక్కెళ్లిపోతున్నాయి. తాజాగా ఓ మొసళ్ల గుంపు ఓ ఆవును చంపి దాని కళేబరాన్ని తీసుకెళ్తున్న దృశ్యం కెమెరాల కంటబడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఆ మొసళ్లును అటవీ శాఖ, ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు సంయుక్తంగా కాపాడుతున్నాయి. ఇప్పటి వరకు 15 కంటే ఎక్కువ మొసళ్లను రక్షించామని తెలిపాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో మాత్రం వడోదరకు సంబంధించినది కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


కాగా, ఆవును తీసుకెళ్తున్న మొసళ్ల గుంపునకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు మిలియన్ల మంది వీక్షించారు. 1.75 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వడోదర ఇకపై మొసళ్ల నగరం``, ``ఇది నిజంగా వడోదరలో చిత్రీకరించిందేనా?``, ``ఇది ఆస్ట్రేలియాకు సంబంధించిన వీడియో``, ``ఇది కాపీ వీడియో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: పెళ్లి వేడుకలో పానీ పూరీ.. పానీ వేసేందుకు వాడిన టెక్నిక్ చూస్తే నివ్వెరపోవాల్సిందే..


Picture Puzzle: మీ దృష్టికి స్పెషల్ టెస్ట్.. ఈ రెండు చేపల్లోని మూడు తేడాలను 8 సెకెన్లలో కనుక్కోండి...


Anand Mahindra: ఒక్క నిమిషంలో 11 వాయిద్యాలు.. సూపర్ ట్యాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా..


Viral Video: ఈ దొంగ మామూలోడు కాదు.. కళ్ల ముందే రూ.5 లక్షల బంగారాన్ని ఎలా కొట్టేశాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 03 , 2024 | 01:51 PM