Share News

Zomato: జొమాటోకు ఓ కస్టమర్ విచిత్ర రిక్వెస్ట్.. చివరకు ఏం జరిగిందో తెలిస్తే నవ్వాపుకోలేరు..!

ABN , Publish Date - Mar 10 , 2024 | 06:44 PM

ప్రస్తుతం చాలా మంది ఇంటి వద్దకే తమకు నచ్చిన ఆహారాన్ని తెప్పించుకుంటున్నారు. జొమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్ ఫుడ్ యాప్‌ల నుంచి ఆర్డర్ చేస్తున్నారు.

Zomato: జొమాటోకు ఓ కస్టమర్ విచిత్ర రిక్వెస్ట్.. చివరకు ఏం జరిగిందో తెలిస్తే నవ్వాపుకోలేరు..!

ప్రస్తుతం చాలా మంది ఇంటి వద్దకే తమకు నచ్చిన ఆహారాన్ని తెప్పించుకుంటున్నారు. జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) వంటి ఆన్‌లైన్ ఫుడ్ యాప్‌ల నుంచి ఆర్డర్ చేస్తున్నారు. ఆర్డర్ చేసే సమయంలో డెలివరీ బాయ్‌కు సూచనలు (Instructions) చేసే వెసులుబాటు కూడా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఉల్లి పాయలు వద్దనో, ప్లాస్టిక్ స్పూన్లు కావాలనో, ప్లేట్లు కావాలనో ఇలా చాలా మంది సూచనలు చేస్తుంటారు. ఆయా సూచనలను బట్టి రెస్టారెంట్లు ప్యాకేజ్ విషయంలో శ్రద్ధ తీసుకుంటాయి.

తాజాగా ఓ కస్టమర్ చేసిన వింత అభ్యర్థన వైరల్ అవుతోంది. తాజాగా జొమాటో నుంచి నాన్-వెజ్ (Non-veg) వంటకాన్ని ఆర్డర్ చేసిన ఓ కస్టమర్.. ``మా ఇంట్లో చికెన్‌కు అనుమతి లేదు. దయచేసి ప్యాకేజ్‌తో పాటు బిల్లు పంపకండి. బిల్లులో చికెన్ (Chicken) గురించి ప్రస్తావించకండి`` అని సూచన చేశాడు. అయితే కస్టమర్ సూచనను రెస్టారెంట్ యాజమాన్యం తప్పుగా అర్థం చేసుకుంది. అతడి చేసిన రిక్వెస్ట్ మెసేజ్‌ను కూడా బిల్లుపై ప్రచురించింది. దీంతో ఆ కస్టమర్ షాక్‌కు గురయ్యాడు.

ఆ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన వారు నవ్వుకుంటున్నారు. 94 వేల మంది ఈ ట్వీట్‌ను వీక్షించారు. ``అరె యార్.. ఇంత క్లియర్‌గా చెప్పిన తర్వాత కూడా అలా చేశారేంటి``, ``పాపం.. ఇంట్లో అతడి పరిస్థితి ఏమైందో``, ``వాళ్లు నోట్స్ ఏంటో కనీసం చూడలేదు.. ప్రింట్ చేసేశారు అంతే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 10 , 2024 | 06:44 PM