Viral: 17 ఏళ్ల క్రితం బార్ బిల్లు వైరల్.. 2007లో ఢిల్లీ బార్‌లో పార్టీ చేసుకుంటే ఎంత ఖర్చైందంటే..
ABN , Publish Date - Sep 29 , 2024 | 10:57 AM
రోజులు గడుస్తున్న కొద్దీ ఖర్చులు పెరుగుతాయి. నిత్యావసరాల ధరలు పెరుగుతుంటాయి. రెండు దశాబ్దాల క్రితం తులం బంగారం రేటుకు, ప్రస్తుత ధరకు హస్తిమశకాంతరం తేడా ఉంటుంది. ఇప్పటి రేట్లకు, అప్పటి ధరలకు పోల్చి చూసుకుని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు.
రోజులు గడుస్తున్న కొద్దీ ఖర్చులు పెరుగుతాయి. నిత్యావసరాల ధరలు పెరుగుతుంటాయి. రెండు దశాబ్దాల క్రితం తులం బంగారం రేటుకు, ప్రస్తుత ధరకు హస్తిమశకాంతరం తేడా ఉంటుంది. ఇప్పటి రేట్లకు, అప్పటి ధరలకు పోల్చి చూసుకుని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి ఎన్నో పురాతన బిల్లులు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ బిల్లు (Bar Bill) నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 2007లో ఢిల్లీ (Delhi)కి చెందిన ఓ బార్‌లో కొందరు వ్యక్తులు చేసిన బిల్లు అది (Viral News).
రెడ్డిట్ వినియోగదారుడు ఒకరు 2007 నాటి బార్ అండ్ రెస్టారెంట్ బిల్లును షేర్ చేశారు. ``ది సప్పర్ ఫ్యాక్టరీ`` అని బార్ అండ్ రెస్టారెంట్‌కు చెందిన 17 ఏళ్ల క్రితం నాటి బిల్లు అది. విస్కీ, బీరుతో పాటు పది రకాల ఆహార పదార్థాలు తీసుకున్నట్టు ఆ బిల్లులో ఉంది. అన్ని పదార్థాలు తీసుకున్నప్పటికీ అయిన బిల్లు మాత్రం కేవలం 2,552 రూపాయలు మాత్రమే. ఐదు బీరు బాటిళ్ల ఖర్చు కేవలం రూ.300 మాత్రమే అని ఆ బిల్లులో ఉంది. అలాగే ప్రీమియం విస్కీ, ఇతర ఆహార పదార్థాల ఖర్చు కూడా తక్కువగానే ఉంది. నేటి ధరలతో పోల్చుకుంటే అది చాలా తక్కువ అనే చెప్పాలి.
ఈ బిల్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ బిల్లు చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ``ఆ రెస్టారెంట్ బిల్లు చూస్తే చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఆ స్థాయిలో పార్టీ చేసుకుంటే 10 వేల కంటే తక్కువ అవదు``, ``ఈ బిల్లు కూడా పాకెట్ ఫ్రెండ్లీ కాదు``, ``ధరల పెరుగుతున్నంత వేగంగా వేతనాలు పెరగడం లేదు``, ``17 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటికి ధరలు 200 రెట్లకు పైగా పెరిగాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: మీ కళ్ల సామర్థ్యానికి పరీక్ష.. ఈ ఫొటోలో పాము ఎక్కడుందో 8 సెకెన్లలో కనుక్కోండి...
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..