Swiggy: స్విగ్గీని ఇలా కూడా వాడొచ్చా? నిశ్చితార్థానికి వచ్చిన గెస్ట్‌ల కోసం ఫుడ్ ఆర్డర్.. స్విగ్గీ రియాక్షన్ ఏంటంటే..!
ABN , Publish Date - Aug 07 , 2024 | 04:00 PM
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మహానగరాల్లో చాలా మంది వాటి పైనే ఆధారపడుతున్నారు. బ్యాచిలర్లు, ఉద్యోగాలు చేసే మహిళలు ఉన్న కుటుంబాలు ఎక్కువగా జొమాటో, స్విగ్గీ వంటి వాటిపైనే ఆధారపడుతున్నారు.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మహానగరాల్లో చాలా మంది వాటి పైనే ఆధారపడుతున్నారు. బ్యాచిలర్లు, ఉద్యోగాలు చేసే మహిళలు ఉన్న కుటుంబాలు ఎక్కువగా జొమాటో, స్విగ్గీ వంటి వాటిపైనే ఆధారపడుతున్నారు. ఇంట్లో తినడానికి ఇలా ఆర్డర్ చేసినా.. ఎదైనా ఫంక్షన్లు, వేడుకలు చేసేటపుడు మాత్రం క్యాటరింగ్ ఇచ్చేస్తారు. లేదా ప్రత్యేకంగా ఛెఫ్‌ను పెట్టి వండిస్తారు. అయితే ఢిల్లీ (Delhi)కి చెందిన ఓ జంట తమ ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ (engagement function) కోసం కూడా స్విగ్గీ (Swiggy) పైనే ఆధారపడింది (Viral News).
తమ ఎంగేజ్‌మెంట్‌కి వచ్చిన అతిథులకు స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేశారు. సుస్మిత అనే యువతి ఆ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశారు. ఫంక్షన్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన టేబుల్‌పై స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ పార్సిల్స్ సర్దుతున్న ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అందరికీ స్విగ్గీ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఖర్చు మామూలుగా ఉండదు. అయినా ఆ జంట వెనకడుగు వేయలేదు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది ఈ ట్వీట్‌పై స్పందించారు. సాధారణ వ్యక్తులే కాదు.. స్విగ్గీ కూడా రియాక్ట్ అయింది.
``వీళ్ల కంటే మా క్రేజీ డీల్స్‌ను ఎవరూ ఉపయోగించుకోవడం లేదు. పెళ్లి విందును కూడా మా ద్వారానే ఆర్డర్ చేయండి`` అని స్విగ్గీ కామెంట్ చేసింది. @shhuushhh అనే ఎక్స్ యూజర్ చేసిన ఈ ట్వీట్‌ను ఇప్పటివరకు 2.3 లక్షల మంది వీక్షించారు. ``స్విగ్గీని ఇలా కూడా వాడొచ్చా``, ``ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది``, ``క్యాటరింగ్ కంపెనీలు ఏమవుతాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: పెళ్లిలో పురోహితుడి చేయి పట్టుకున్న వధువు.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి