IQ Test: మీ ఐక్యూకు నిజమైన పరీక్ష.. ఈ ఫొటోలో ఏ అక్షరానికి ముందుగా బెల్ తగులుతుందో 8 సెకెన్లలో చెప్పండి..!
ABN , Publish Date - Aug 07 , 2024 | 02:58 PM
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో చైన్ సిస్టమ్‌కు అనుసంధానమై ఉన్న బెల్ ఉంది. ఆ బెల్కు రెండు వైపులా ``A``, ``B`` అక్షరాలు ఉన్నాయి. ఆ రెండు అక్షరాల్లో దేనికి ఆ ముందుగా ఆ బెల్ తగులుతుందో చెప్పగలగాలి. ఆ చక్రాల పొజిషన్, మూమెంట్‌ను అంచనా వేస్తేనే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. కేవలం 8 సెకెన్ల టైమ్‌లో ఈ పజిల్‌ను పరిష్కరించాలి. అలా పరిష్కరించగలిగితే మీ ఐక్యూ లెవెల్ అద్భుతంగా ఉందని నమ్మవచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే ఈ ప్రశ్నకు సమాధానం.. ``A``. ఎలాగో ఆలోచించండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: పెళ్లిలో పురోహితుడి చేయి పట్టుకున్న వధువు.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి