Share News

Viral Video: ఇంగ్లిష్‌లో దడదడలాడించిన రిక్షావాలా.. బ్రిటిషర్లనే షేక్ చేశాడుగా..

ABN , Publish Date - Feb 11 , 2024 | 05:53 PM

బ్రిటన్ పర్యాటకులను తన అతిథిమర్యాదలతో అబ్బురపరిచిన రిక్షావాలా వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: ఇంగ్లిష్‌లో దడదడలాడించిన రిక్షావాలా.. బ్రిటిషర్లనే షేక్ చేశాడుగా..

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌కు నిజమైన బ్రాండ్ అంబాసిడర్లు సామాన్య పౌరులే. విదేశీ టూరిస్టులకు దేశంలో ఏ ఇబ్బందీ కలగకుండా చక్కటి ప్రయాణ అనుభూతి మిగిల్చి స్వదేశానికి సాగనంపితే భారత్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోవాల్సిందే. ఢిల్లీలోని ఓ రిక్షావాలా అదే చేశాడు. బ్రిటన్ నుంచి వచ్చిన ఇద్దరు టూరిస్టులతో చక్కటి ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ ఢిల్లీ గొప్పదనం, చారిత్రక కట్టడాల గొప్పదనాన్ని వివరించాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఇదంతా రికార్డు చేసి నెట్టింట పెట్టడంతో ఈ వీడియో వైరల్‌గా (ViralVideo) మారింది.


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఇద్దరు బ్రిటన్ దేశస్థులు జామా మస్జిద్ చూసేందుకు ఓ కుర్రాడి రిక్షా ఎక్కారు. ఆ తరువాత రిక్షావాలా వారికి ఢిల్లీ గొప్పదనం గురించి మంచి ఇంగ్లిష్‌లో అద్భుతంగా చెప్పాడు. జామా మస్జిద్ గురించి, ఆసియాలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల మార్కెట్ గురించి చెప్పాడు. చిన్న చిన్న సందుల్లో కూడా మంచి షాపులు ఉంటాయని, ఇష్టమైతే షాపింగ్ కూడా చేద్దామని అతడు టూరిస్టులకు వివరించాడు (Delhi cycle-rickshaw driver speaks in clear English while guiding tourists).


అటువైపు నుంచే వెళుతున్న ఓ వ్యక్తి ఇదంతా రికార్డు చేసి నెట్టింట పెట్టడంతో జనాలు రిక్షావాలా ఇంగ్లిష్‌ చూసి ఆశ్చర్యపోతున్నారు. అతడి అతిథిమర్యాద కూడా వారిని అబ్బుర పరిచింది. దేశానికి వీళ్లే నిజమైన బ్రాండ్ అంబాసిడర్లంటూ కొందరు కామెంట్ చేశారు. ఇలాంటి చర్యలతో ఇరు దేశాల మధ్య స్నేహ, దౌత్య సంబంధాలు బలపడతాయంటూ కామెంట్ చేశారు. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - Feb 11 , 2024 | 06:00 PM