Diwali 2024: దీపావళి రోజున ఈ తప్పులు అస్సలు చేయకండి..
ABN , Publish Date - Oct 30 , 2024 | 10:19 PM
Diwali 2024: దీపావళి పండుగను దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఉపవాసాలు ఆచరించి.. భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి పూజ నిర్వహిస్తారు. ఆపై.. తమ ఇళ్లంతా దీపాలతో అలంకరిస్తారు. దీప కాంతితో.. ఇళ్లన్నీ జిగేల్‌మంటాయి.
Diwali 2024: దీపావళి పండుగను దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఉపవాసాలు ఆచరించి.. భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి పూజ నిర్వహిస్తారు. ఆపై.. తమ ఇళ్లంతా దీపాలతో అలంకరిస్తారు. దీప కాంతితో.. ఇళ్లన్నీ జిగేల్‌మంటాయి. సాయంత్రం టపాసులు కాల్చి సెలబ్రేట్ చేసుకుంటారు. దీపావళి ప్రతి ఒక్కరి ఇళ్లలో కాంతి, ఆనందం, కొత్త ఉత్సాహాన్ని నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, దీపావళి సెలబ్రేషన్స్ కొన్నిసార్లు కొందరిని ఇబ్బందులకు గురి చేస్తుంది. వారు చేసే కొన్ని పొరపాట్లు వారిని ప్రమాదాల బారిన పడేస్తుంది. ముఖ్యంగా దీపావళి పర్వదినాన ఈ 5 తప్పులు అస్సలు చేయకండి..
టపాసులతో జాగ్రత్త..
దీపావళి పర్వదినాన ప్రజలంతా టపాసులు కాలుస్తారు. కానీ, క్రాకర్స్ కాల్చడం వల్ల పర్యావరణం, ఆరోగ్యానికి హానీ కలుగుతుంది. అందుకే పరిమిత పరిమాణంలో క్రాకర్లు పేల్చండి. ప్రస్తుత మార్కెట్‌లో చాలా తక్కువ పొగ, శబ్దం కలిగిన పర్యావరణ అనుకూలమైన క్రాకర్స్ చాలా ఉన్నాయి.
2. భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం..
క్రాకర్స్ పేల్చేటప్పుడూ, దీపాలు వెలిగించేటప్పుడూ భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గాయాలపాలయ్యే అవకాశం ఉంది. అందుకే బహిరంగ ప్రదేశాల్లో క్రాకర్స్ పేల్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. అగ్ని ప్రమాదానికి అవకాశం లేని ప్రదేశాలలో దీపాలను వెలిగించండి. దీపాలు వెలిగించిన ప్రాంగణంలో గానీ.. క్రాకర్స్ కాల్చే ప్రాంగణంలో గానీ ఒక బకెట్ నీటిని ఉంచుకోవాలి. ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే మంటలను ఆర్పేయడానికి వీలుంటుంది.
3. బహుమతులపై జాగ్రత్త వహించండి..
దీపావళి రోజున బహుమతులు ఇవ్వడం ఒక సంప్రదాయం. అయితే ఇతరులకు ఉపయోగపడే, వారు నిజంగా ఇష్టపడే బహుమతిని తీసుకోండి. ఆలోచించకుండా బహుమతులు ఇవ్వడం వల్ల ఖర్చులు పెరిగి ఇతరులకు కూడా ఉపయోగం ఉండదు. బహుమతిని కొనుగోలు చేసేటప్పుడు.. ఎక్కువ ఖర్చు కాకుండా.. మీపై ఎక్కువ భారం పడకుండా చూసుకోండి. అదే సమయంలో ఇతరుల ప్రాధాన్యతలను గుర్తించండి.
4. మద్యం..
కొందరు దీపావళి రోజు మద్యం సేవిస్తారు. ఈ సామాజిక దురాచారాన్ని శాశ్వతంగా వదిలివేయడం ఉత్తమం. దీపావళి సందర్భంగా మీ కుటుంబానికి సమయం ఇవ్వండి. మద్యం సేవించడంలో సమయాన్ని వృధా చేయకండి.
5. జూదం..
దీపావళి సందర్భంగా కొందరు జూదం ఆడతారు. అందులో వేల లక్షల రూపాయలు పోగొట్టుకుంటారు. ఇది వారిని అప్పులపాలు చేస్తుంది. ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఉంటుంది. దీపావళి పర్వదినాన.. ఇలాంటి దురలవాట్లను వీడండి.
Also Read:
ఫామ్ హౌస్ కేసులో ముగిసిన రాజ్ పాకాల విచారణ..
టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు..
పొడవైన కింగ్ కోబ్రాతో ఫన్నీ గేమ్స్.. చివరకు..
For More Special News and Telugu News..