Viral Video: మనం రోజూ ఉపయోగించే కత్తెర తయారీ వెనుక ఇంత శ్రమ ఉందా? వైరల్ వీడియో చూడండి..
ABN , Publish Date - Mar 24 , 2024 | 03:52 PM
బట్టలు కత్తిరించడం నుంచి జుట్టుకు అందమైన రూపం ఇవ్వడం వరకు కత్తెర ఎంతో అవసరం. అంతెందుకు వైద్యులు కూడా కత్తెరలను ఉపయోగించే ఆపరేషన్లు చేస్తారు. ఇంత కీలకమైన కత్తెరలను ఎలా తయారు చేస్తారో తెలుసా?
మన రోజువారీ జీవితంలో కత్తెర (Scissors) లేకపోతే చాలా పనులు చేయలేం. సాధారణ వ్యక్తులే కాదు.. బట్టలు కత్తిరించడం నుంచి జుట్టుకు అందమైన రూపం ఇవ్వడం వరకు కత్తెర ఎంతో అవసరం. అంతెందుకు వైద్యులు కూడా కత్తెరలను ఉపయోగించే ఆపరేషన్లు చేస్తారు. ఇంత కీలకమైన కత్తెరలను ఎలా తయారు చేస్తారో తెలుసా? వీటి తయారీ వెనుక ఎంతో కష్టం, రిస్క్ ఉంటుందో తెలుసా? వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తేనే అసలు విషయం అర్థమవుతుంది (Scissors making Video).
zamidar short అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మీరు కత్తెరను తయారు చేసే మొత్తం ప్రక్రియను చూడవచ్చు.ఒక వ్యక్తి బ్లాక్ పౌడర్‌లో ద్రవాన్ని కలిపి దానిని అచ్చు వేశాడు. ఆ తర్వాత వాటిని నిప్పుల కొలిమిలో వేసి విడి భాగాలను తయారు చేశారు. తర్వాత కత్తెర భాగాలను కలిపారు. తర్వాత వాటికి స్క్రూలు బిగించి, పదును పెట్టారు. ఈ మొత్తం ప్రక్రియ చాలా ప్రమాదకరంగా ఉంది. కార్మికులు ఎవరూ కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పని చేస్తున్నారు.
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రెండేళ్ల పాపను ఈడ్చుకెళ్లిన తోడేలు.. తర్వాతేం జరిగిందో చూడండి..
వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు 50 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``చాలా కష్టమైన పని``, ``ఎక్కువ శ్రమ, తక్కువ రాబడి``, ``చాలా ప్రమాదకరంగా ఉంది``, ``ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కష్టాలు తప్పవు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.