Viral: కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన వ్యక్తి.. అతడు చెప్పింది విని వెంటనే ఆపరేషన్ చేసి షాకైన డాక్టర్లు!
ABN , Publish Date - Aug 06 , 2024 | 03:43 PM
ఆ వ్యక్తి వియత్నాంలో నివసిస్తున్న భారతీయుడు.. ఇటీవల ఓ విచిత్రమైన పని చేసి అందరికీ షాకిచ్చాడు.. ఫలితంగా హాస్పిటల్ పాలయ్యాడు.. డాక్టర్లు సకాలంలో ఆపరేషన్ చేయడంతో బతికి బయటపడ్డాడు.. ఆ వ్యక్తికి సంబంధించిన కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వ్యక్తి వియత్నాం (Vietnam)లో నివసిస్తున్న భారతీయుడు.. ఇటీవల ఓ విచిత్రమైన పని చేసి అందరికీ షాకిచ్చాడు.. ఫలితంగా హాస్పిటల్ పాలయ్యాడు.. డాక్టర్లు సకాలంలో ఆపరేషన్ చేయడంతో బతికి బయటపడ్డాడు.. ఆ వ్యక్తికి సంబంధించిన కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వియత్నాం రాజధాని హనోయిలో నివసిస్తున్న 31 ఏళ్ల భారతీయుడు విపరీతమైన కడుపునొప్పితో (Stomach ache) బాధపడుతూ స్థానిక ఆసుపత్రికి (Hospital) వెళ్లాడు. ఆ వ్యక్తి కడుపు నొప్పితో కేకలు పెడుతూ ఆస్పత్రిలోకి ప్రవేశించాడు. తనకేం జరిగిందో చెప్పడంతో డాక్టర్లే షాకయ్యారు (Viral News).
ఆ వ్యక్తి బతికి ఉన్న ఈల్ (live eel) చేపను తన మలద్వారం గుండా కడుపులోకి పంపించాడు. ఆ విషయాన్ని మొదట డాక్టర్లు నమ్మలేదు. కానీ ఎక్స్-రే, అల్ట్రాసౌండ్ వంటి ఇతర పరీక్షలు చేసి డాక్టర్లు షాకయ్యారు. వెంటనే అతడికి శస్త్రచికిత్స నిర్వహించారు. మొదట మలద్వారం ద్వారా గుండానే ఈల్‌ను బయటకు తీయడానికి డాక్టర్లు ప్రయత్నించారు. కానీ అది విజయవంతం కాకపోవడంతో వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. ఆపరేషన్ చేసి అతడి కడుపులోని 25 అంగుళాల ఈల్ చేపను, ఓ నిమ్మకాయను బయటకు తీశారు.
ఆ వ్యక్తి కడుపులోకి వెళ్లిన తర్వాత కూడా ఆ ఈల్ చేప బతికే ఉంది. బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన ఆ చేప పొత్తికడుపు కుహరంలోకి ప్రవేశించి, అతని పురీషనాళం, పెద్ద పేగును కొరికింది. సదరు వ్యక్తి సరదా కోసం అలాంటి పిచ్చి పనులు చేస్తుంటాడని చెబుతున్నారు. ఏదేమైనా అతడి వ్యవహారం సోషల్ మీడియాలో చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.
ఇవి కూడా చదవండి..
Viral: ఇదెక్కడి విడ్డూరం.. తలలో పేను ఉందని విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అసలేం జరిగిందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి