Viral Video: వీళ్లకు మానవత్వం ఉందా? బాలుడిపై కుక్క దాడి చేస్తుంటే చుట్టూ ఉన్న వారు ఏం చేశారో చూడండి..
ABN , Publish Date - Apr 10 , 2024 | 04:31 PM
దేశంలో చాలా నగరాల్లో కుక్కలు చిన్న పిల్లలపై దాడులకు తెగబడుతున్నాయి. తగినంత ఆహారం అందకపోవడం వల్లో, మరే ఇతర కారణం వల్లో తెలియదు గానీ, పిచ్చిగా ప్రవర్తిస్తూ అందరినీ హడలెత్తిస్తున్నాయి. ఆయా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దేశంలో చాలా నగరాల్లో కుక్కలు చిన్న పిల్లలపై దాడులకు తెగబడుతున్నాయి. తగినంత ఆహారం అందకపోవడం వల్లో, మరే ఇతర కారణం వల్లో తెలియదు గానీ, పిచ్చిగా ప్రవర్తిస్తూ అందరినీ హడలెత్తిస్తున్నాయి. ఆయా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. 15 ఏళ్ల బాలుడిపై ఓ పిట్ బుల్ డాగ్ (Pitbull Dog)విచక్షణా రహితంగా దాడి చేసింది (Dog attacks Boy).
ఘజియాబాద్‌కు (Ghaziabad) చెందిన 15 ఏళ్ల కుర్రాడు రోడ్డుపై ఉండగా ఓ బుల్ డాగ్ అతడిపై దాడికి దిగింది. రోడ్డుపై పడిపోయిన బాలుడిని తనకు అందిన చోటల్లా కరిచేసింది. ఆ ఘటనను చూస్తున్న ఇద్దరు వ్యక్తులు కనీసం స్పందన లేకుండా నిల్చుండిపోయారు. ఆ కుక్కపై కర్ర, రాయో విసిరి ఆ కుర్రాడిని కాపాడాలనే కనీస ప్రయత్నం కూడా చేయలేదు. తమకు సంబంధం లేనట్టు నిల్చుని ఉండిపోయారు. ఆ ఘటన మొత్తం వీధిలో అమర్చిన సీసీటీవీలో రికార్డ్ అయింది. పిట్ బుల్ డాగ్స్ సాధారణంగా దాడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.15 లక్షల మందికి పైగా వీక్షించారు. కనీస సహాయం కూడా చేయకుండా నిల్చున్న వ్యక్తులపై విమర్శలు కురిపించారు. ``పిట్ బుల్ డాగ్స్‌ను రోడ్ల పైకి ఎలా తీసుకువచ్చార``, ``పిట్ బుల్స్‌పై కఠినమైన నిషేధం విధించాలి``, ``వారు కనీసం సహాయం చేయకుండా ఎలా నిల్చున్నారో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral: షాప్‌లో పని చేసేందుకు హెల్పర్ కావలెను.. జీతం ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..