Dubai Storm: భయంకరం.. క్షణాల్లో ఆకుపచ్చగా మారిపోయిన ఆకాశం.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!
ABN , Publish Date - Apr 19 , 2024 | 02:40 PM
ఎడారి దేశం దుబాయ్‌ను తీవ్ర తుఫాన్ అతలాకుతలం చేసింది. ఆకస్మిక భారీ వర్షాలకు దుబాయ్‌లోని రోడ్లు, షాపింగ్ మాల్స్, విమానాశ్రయం, రన్ వేలు మొదలైనవన్నీ నీటితో నిండిపోయాయి. గత 75 ఏళ్లలో దుబాయ్‌లో నమోదైన అత్యంత భారీ వర్షపాతం ఇదే. ఈ వరదల కారణంగా దుబాయ్‌కు భారీ నష్టం సంభవించింది.
ఎడారి దేశం దుబాయ్ (Dubai)ను తీవ్ర తుఫాన్ అతలాకుతలం చేసింది. ఆకస్మిక భారీ వర్షాలకు దుబాయ్‌లోని రోడ్లు, షాపింగ్ మాల్స్, విమానాశ్రయం, రన్ వేలు మొదలైనవన్నీ నీటితో నిండిపోయాయి. గత 75 ఏళ్లలో దుబాయ్‌లో నమోదైన అత్యంత భారీ వర్షపాతం ఇదే. ఈ వరదల కారణంగా దుబాయ్‌కు భారీ నష్టం సంభవించింది (Dubai Storm). ఈ తీవ్ర తుఫాన్ సమయంలో దుబాయ్‌లో చోటు చేసుకున్న వాతావరణ మార్పులు అత్యంత భయంకరంగా ఉన్నాయి. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దుబాయ్‌ను తుఫాన్ కమ్మేస్తున్న సమయంలో ఆకాశంలో (Sky) భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. సెకెన్ల వ్యవధిలోనే ఆకాశం ఆకుపచ్చగా మారిపోయింది. విపరీతమైన గాలులు కమ్మేశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాలో గ్రాఫిక్స్ తరహాలో క్షణాల్లోనే అంతా మారిపోయి కుంభవృష్టి మొదలైంది. దుబాయ్‌లో సాధారణంగా ఏడాదికి 200 మి.లీ. వర్షం మాత్రమే కురుస్తుంది. అలాగే వేసవిలో ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటేస్తుంది.
ఉష్ణోగ్రతను తగ్గించేందుకు, వర్షాల కోసం దుబాయ్ అధికారులు తరచుగా క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంటారు. తాజా భారీ విపత్తుకు ఆ టెక్నాలజీయే కారణమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కాగా, @Angryman అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ తుఫాను వీడియో షేర్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వీడియోపై తమ స్పందనలను తెలియజేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Puzzle: మీ బ్రెయిన్ ఎంత షార్ప్‌గా ఉందో టెస్ట్ చేసుకోండి.. ఈ రెండు ఫొటోల్లోని తేడాలను కనిపెట్టండి..!
Indian Whisky: ఇండియన్ విస్కీతో కిక్కే వేరబ్బా.. మన సింగిల్ మాల్ట్ విస్కీకి ఫారినర్లు ఫిదా!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..