‘స్నాక్ మనీ’ సంపాదిస్తున్నాయి!
ABN , Publish Date - Oct 27 , 2024 | 09:11 AM
కుక్కలు, పిల్లులకు కూడా రెజ్యూమ్స్ ఉంటాయా? ఎందుకనే అనుమానమూ వస్తుంది. ‘మా పెట్‌డాగ్ అందరితో కలిసిపోతుంది. మా పిల్లి కూల్‌గా ఉంటుంది. నవ్విస్తుంది’ అంటూ కొన్ని కాఫీషాప్‌లకు పెట్ యజమానులు రెజ్యూమ్స్ పంపిస్తున్నారు. కాఫీషాప్‌లో పని చేసి పెట్స్ వాటికి కావాల్సిన ‘స్నాక్ మనీ’ సంపాదించుకుంటున్నాయి. ఇప్పుడిది చైనాలో లేటెస్ట్ ట్రెండ్.
కుక్కలు, పిల్లులకు కూడా రెజ్యూమ్స్ ఉంటాయా? ఎందుకనే అనుమానమూ వస్తుంది. ‘మా పెట్‌డాగ్ అందరితో కలిసిపోతుంది. మా పిల్లి కూల్‌గా ఉంటుంది. నవ్విస్తుంది’ అంటూ కొన్ని కాఫీషాప్‌లకు పెట్ యజమానులు రెజ్యూమ్స్ పంపిస్తున్నారు. కాఫీషాప్‌లో పని చేసి పెట్స్ వాటికి కావాల్సిన ‘స్నాక్ మనీ’ సంపాదించుకుంటున్నాయి. ఇప్పుడిది చైనాలో లేటెస్ట్ ట్రెండ్.
కాఫీషాప్స్‌కు స్నేహితులు, ఫ్యామిలీతో వెళ్తారు. కాఫీ తాగి, కుకీస్ తిని వెళ్లకుండా అక్కడే ఉన్న క్యూట్ పెట్స్‌తో ఆడుకుంటే రిలాక్స్ కూడా అవుతారు. ఇదే ఆలోచన చైనాలోని కాఫీషాప్ యజమానులకు వచ్చింది. దాంతో మంచి ఐక్యూ లెవల్ ఉండే శునకాలు, పిల్లులను తమ కాఫీ షాప్‌లో ఉద్యోగులుగా తీసుకుంటున్నారు. అవి అక్కడేమీ పని చేయనక్కర్లేదు. మనుషులతో బాగా కలిసిపోవాలి. వారితో ఆడుకోవాలి. కస్టమర్లను రిలాక్స్ మూడ్‌లోకి తీసుకెళ్లాలి. కొందరు స్వంత పెట్స్‌తో కాఫీ షాప్‌కు వచ్చినపుడు... వాటితో కూడా ఇవి ఆడుకుంటున్నాయి.
చైనాలోని ఫుజో నగరంలో ఇరవై ఏడేళ్ల పీహెచ్‌డీ విద్యార్థి గ్జాంగ్ గ్జూ ఇంట్లో రెండున్నరేళ్ల ‘ఓకే’ అనే తెల్ల కుక్కపిల్ల ఉంది. ‘‘బడిలో చిన్న పిల్లోడిని వదిలేసినట్లు కేఫ్‌లో ఓకేను వదిలేస్తాను. అది ఒంటరిగా కాకుండా ఇతర పెట్స్‌తో ఆడుకుంటుంది. ఒంటరితనం ఫీలవ్వదు. పైగా దాని తిండికి షాప్ యజమాని జీతం ఇస్తాడు. అంటే ‘స్నాక్ మనీ’ని అదే సంపాదించుకుంటోంది. ఇది విన్ విన్ సిచ్యువేషన్’’ అంటాడు గ్జూ.
కెఫేల్లో వినోదం పంచడానికి కుక్కలు, పిల్లులు ఉన్నాయని బోర్డు పెడుతున్నారు చాలామంది యజమానులు. మరో విశేషమేమిటంటే పెట్స్‌కు పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ ఉద్యోగాలు ఉంటున్నాయి. ‘మాకు హెల్తీ క్యాట్స్ కావాలి. చురుగ్గా ఉండే ఎంప్లాయికే ప్రాధాన్యత. వాటి యజమానుల స్నేహితులకు ఫుడ్‌లో మేము 30 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తాం’ అంటూ అక్కడి కేఫ్ యజమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
గ్జిన్ అనే మహిళ దగ్గర రెండు పిల్లులున్నాయి. వాటి ఆహారానికే నెలకు 500 యెన్‌లు ఖర్చు అవుతాయట. ‘‘అవి ‘స్నాక్ మనీ’ సంపాదించుకుంటే మాకు కలిసొచ్చినట్లే కదా!’’ అంటోందామె. అన్నట్లు డాగ్స్, క్యాట్స్ అందంగా ఉన్నాయనీ వాటి ఓనర్లు చెప్పే మాటలను ప్రాతిపదికగా తీసుకుని ఉద్యోగాలు ఇవ్వట్లేదు కేఫ్ యజమానులు. పెట్స్‌ను ఒకరోజు ట్రయల్ రన్‌లా కేఫ్‌లోని అనుమతిస్తారు. కస్టమర్లతో అవి ఎలా ఉంటున్నాయని చూస్తారు. మిగతా వాటితో ఎలా బిహేవ్ చేస్తున్నాయని పరిశీలిస్తారు. ఆ తర్వాతే వాటిని జాబ్‌లోకి తీసుకుంటున్నారు. ఇలా పెట్ ఎంప్లాయ్స్‌కు స్ర్కీనింగ్ కాస్త గట్టిగానే ఉండటం కొసమెరుపు.