Vintage Cars: బైక్ ధరలో కారు.. ఇప్పుడిదే ఫ్యాషన్ గురూ
ABN , Publish Date - Jul 11 , 2024 | 05:14 PM
వింటేజ్ కార్లు.. ఈ పేరు ఎప్పుడూ వినలేదా. ఇప్పుడు హైదరాబాద్ సహా దేశంలోని పలు అభివృద్ధి చెందుతున్న పట్టణాలు, గ్రామాల్లో ఇదే ఇప్పుడు ట్రెండ్. బైక్ కొనుగోలు చేసే డబ్బులతో ఇది అందుబాటులో ఉండటం ప్రత్యేకం. ఈ మోడళ్లో మారుతున్న కాలానికి తగ్గట్లు కరెంటుతో నడిచే కార్లను అందుబాటులోకి తెస్తున్నారు.
హైదరాబాద్: వింటేజ్ కార్లు..(Vintage Cars) ఈ పేరు ఎప్పుడూ వినలేదా. ఇప్పుడు హైదరాబాద్ సహా దేశంలోని పలు అభివృద్ధి చెందుతున్న పట్టణాలు, గ్రామాల్లో ఇదే ఇప్పుడు ట్రెండ్. బైక్ కొనుగోలు చేసే డబ్బులతో ఇది అందుబాటులో ఉండటం ప్రత్యేకం.
ఈ మోడల్‌లో మారుతున్న కాలానికి తగ్గట్లు కరెంటుతో నడిచే కార్లను అందుబాటులోకి తెస్తున్నారు. 19వ శతాబ్దానికి చెందిన వారికి ఇలాంటి పాత మోడళ్ల కార్లు తెలిసే ఉంటాయి. ఇప్పుడంటే బెంజ్, ఆడీ వంటి బడాబడా కార్లు మార్కె్ట్లో ఉన్నప్పటికీ.. అప్పటి వాహనాలు నడపాలని చాలా మందికి ఉంటుంది.
అలాంటి వారి కోసమే వింటేజ్ కార్లు తీసుకువస్తున్నారు. హరియాణా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో వీటిని ఎక్కువగా తయారు చేస్తున్నారు. పాత కార్లు ఇష్టపడే వారి కోసమే వీటిని ప్రత్యేకంగా చేస్తున్నట్లు తయారీదారులు చెబుతున్నారు.
ఈ కార్ల మోటారు సామర్థ్యం 1,000 వాట్లు, 48V లిథియం-అయాన్ బ్యాటరీ 1 hp, 2.2 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 35 కిమీ. గరిష్ఠ వేగ పరిధి 100 కిమీ. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 4 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. గ్రీన్ మాస్టర్ టూ సీటర్ కార్ ధర రూ.1.45 లక్షల నుంచి రూ.2.45 లక్షలుగా ఉంది.
For Latest News and National News click here