Share News

Viral Video: ఈ ఏనుగులకు ఇంత క్రమశిక్షణ ఎవరు నేర్పారు? ఎంత పద్ధతిగా వ్యాన్ ఎక్కుతున్నాయో చూడండి..

ABN , Publish Date - May 18 , 2024 | 04:07 PM

మనుషులు స్వీయ స్పృహతో, క్రమశిక్షణతో మెలుగుతారు. జంతువులకు అలాంటివేవీ ఉండవు. తమకు నచ్చినట్టు విచ్చలవిడిగా ప్రవర్తిస్తాయి. అయితే ట్రైనింగ్ ఇస్తే మనుషుల కంటే జంతువులే క్రమశిక్షణగా ఉంటాయని ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే అర్థమవుతుంది.

Viral Video: ఈ ఏనుగులకు ఇంత క్రమశిక్షణ ఎవరు నేర్పారు? ఎంత పద్ధతిగా వ్యాన్ ఎక్కుతున్నాయో చూడండి..
Elephants

మనుషులు స్వీయ స్పృహతో, క్రమశిక్షణతో మెలుగుతారు. జంతువులకు అలాంటివేవీ ఉండవు. తమకు నచ్చినట్టు విచ్చలవిడిగా ప్రవర్తిస్తాయి. అయితే ట్రైనింగ్ ఇస్తే మనుషుల కంటే జంతువులే క్రమశిక్షణగా ఉంటాయని ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆ వీడియోలోని ఏనుగుల (Elephants) డిసిప్లిన్ చూసి కిరణ్ బేదీ (Kiran Bedi) కూడా ఆశ్చర్యపోయారు. ఆ వీడియోను ఆమె తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో రెండు ఏనుగులను వాటి శిక్షకులు టెంపో ఎక్కిస్తున్నారు. ఆగి ఉన్న టెంపో (Tempo) ముందు ఓ స్టూల్ ఉంచారు. ఓ ఏనుగు వచ్చి ఆ స్టూల్ మీద కాళ్లు పెట్టి టెంపో పైకి ఎక్కి బుద్ధిగా పక్కకు జరిగి నిల్చుంది. ఆ తర్వాత మరో ఏనుగు వెనక్కి తిరిగి టెంపో పైకి ఎక్కింది. అనంతరం కింద ఉన్న స్టూల్‌ను తన తొండంతో పైకి తీసి టెంపోలో పెట్టేసింది. అప్పుడు ఓ వ్యక్తి వచ్చి వాటికి టైట్‌గా చెయిన్ కట్టాడు. ఎంతో ట్రైనింగ్ ఇస్తేనే ఏనుగులు అంత క్రమశిక్షణతో మెలుగుతాయి.


కిరణ్ బేదీ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 96 వేల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``చాలా లవ్లీగా ఉంది``, ``ఏనుగులు చాలా స్మార్ట్``, ``వాటిని చూస్తే చాలా జాలిగా ఉంది``, ``ఈ క్రమశిక్షణ అవసరం లేని జంతువులు అవి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Opitcal Illusion: మీ కళ్లకు రియల్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న పులిని 9 సెకెన్లలో కనిపెట్టండి!


Viral Video: వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే.. విమానం నుంచి దిగుతున్న వ్యక్తికి షాకింగ్ అనుభవం!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 18 , 2024 | 04:07 PM