Share News

Viral: వార్నీ.. రిజైన్ లెటర్‌లో అలా ఎవరైనా రాస్తారా? అసలేం రాశాడో తెలిస్తే పగలబడి నవ్వుకోవాల్సిందే..

ABN , Publish Date - Oct 15 , 2024 | 02:05 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిజైన్ లెటర్‌లో ఓ వ్యక్తి ఎవ్వరూ ఊహించని ప్రపోజల్ పెట్టాడు. ఆ లెటర్ చదివిన చాలా మంది నవ్వుకుంటున్నారు. సదరు ఉద్యోగి ఎంతో నిజాయితీతో, అమాయకత్వంతో ఈ రాజీనామా లేఖ రాయడంతో సోషల్ మీడియాలో జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

Viral: వార్నీ.. రిజైన్ లెటర్‌లో అలా ఎవరైనా రాస్తారా? అసలేం రాశాడో తెలిస్తే పగలబడి నవ్వుకోవాల్సిందే..
Funny Resign Letter

సాధారణంగా ఎవరైనా రాజీనామా లేఖలో (Resignation letter) ఉద్యోగం మానేస్తున్నట్టు చెబుతారు. తమ సమస్యలను వివరించి ఎందుకు మానేస్తున్నారో తెలియజేస్తారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిజైన్ లెటర్‌లో ఓ వ్యక్తి ఎవ్వరూ ఊహించని ప్రపోజల్ పెట్టాడు. ఆ లెటర్ చదివిన చాలా మంది నవ్వుకుంటున్నారు. సదరు ఉద్యోగి ఎంతో నిజాయితీతో, అమాయకత్వంతో ఈ రాజీనామా లేఖ రాయడంతో సోషల్ మీడియాలో జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. wallstreetoasis అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ లెటర్ షేర్ అయింది (Funny Resign Letter).


వైరల్ అవుతున్న ఆ రాజీనామా లెటర్‌ ప్రకారం.. ఆ వ్యక్తికి వేరే కంపెనీలో ఉద్యోగం రావడంతో ప్రస్తుత ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కంపెనీ బాస్‌కు రాజీనామా లేఖ పంపించాడు. అయితే ఆ లేఖలో.. ``నాకు వేరే సంస్థలో ఉద్యోగం వచ్చింది. నేను అక్కడకు వెళ్లి ఆ కొత్త జాబ్‌లో చేరాలనుకుంటున్నా. ఒకవేళ అక్కడ నాకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే మళ్లీ వెనక్కి వచ్చేస్తా. మేనేజ్‌మెంట్, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు`` అని ఆ రాజీనామా లేఖలో రాశాడు. ఆ లెటర్‌లో అతడు రాసింది చదివిన హెచ్‌ఆర్ సిబ్బంది షాక్‌కు గురయ్యారు. ఆ లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది వైరల్‌గా మారింది.


ఆ వైరల్ రిజైన్ లెటర్‌ను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. 38 వేల మందికి పైగా ఆ లెటర్‌ను లైక్ చేశారు. ఆ లెటర్‌పై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా కామెంట్లు చేశారు. ``ఆ వ్యక్తి చాలా నిజాయితీగా రాశాడు``, ``అలా వెనక్కి వస్తే శాలరీ తగ్గించి తీసుకుంటారు బ్రదర్``, ``బ్రదర్‌కు ప్లాన్ బి కూడా ఉంది``, ``ఆ లెటర్‌లో చాలా గ్రామర్ తప్పులు ఉన్నాయి, అలాగే నిజాయితీ కూడా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 15 , 2024 | 02:05 PM